Tuesday, 25 April 2017

ఆండ్రాయిడ్ యూజ‌ర్ల కోసం కొత్త ఫొటో ఎడిటింగ్ యాప్



 విహార యాత్రలు  గాని లేదా మన ఇళ్లలో ఎప్పడైనా పుట్టినరోజు వంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఫోటోలు తీస్తాం. గాని మనకు ప్రొఫిషన్  ఫోటోగ్రాఫర్ తేడా మనం తీసే ఫొటోసే .కానీ అది ఖర్చుతో కూడుకున్నది .  ప్రతి ఇంటిలోఆండ్రాయిడ్ డివైస్‌ ఉంటుంది .  అందువలన  ఆండ్రాయిడ్  ఫోన్ లో ఫోటోలు తీసిదాన్నిఫొటోల‌ను ఎడిట్ చేసుకుని వెంట‌నే ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్  చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లో యూజ‌ర్ల కోసం ఓ కొత్త ఫొటో ఎడిటింగ్ యాప్ తాజాగా అందుబాటులోకి వ‌చ్చింది. అదే ఎఫిషియంట్ ఫొటో ప్రాసెస‌ర్. 


ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు..

కొత్త యాప్ ఫొటోల‌పై తమకు నచ్చిన టెక్ట్స్‌ను రాసే విధంగాప్ర‌త్యేక‌మైన టూల్‌ను రూపొందించారు. షేర్ మరి కొన్ని ఫీచ‌ర్లు ఉన్నాయి  యూజ‌ర్లు త‌మ ఫొటోల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఇక ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు


ప్లేస్టోర్లో...

   గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్ష‌న్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

Monday, 24 April 2017

కాపీ చెయ్యకుండా పేస్ట్ చెయ్యడం సాధ్యమేనా


కాపీ చెయ్యకుండా  పేస్ట్   చెయ్యడం సాధ్యమేనా కానీ  ఇది నిజం....
 చాలా  కంపెనీ లు  చెయ్యలేని  పనిని  మన గూగుల్   తన  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో'కాపీలెస్ పేస్ట్‌'గా పిలుస్తున్న ఈ ఫీచర్   అందుబాటులోకి తెస్తుంది . ఈ softwear వలన  మనకు అవసరం అయిన  ఏ ఆ ప‌దాల‌ను అయిన గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌  లో టైపుచేస్తాము . అదే  పదం ను  అది గుర్తుంచుకొని  మనం మళ్ళీ క్రోమ్ బ్రౌజ‌ర్‌  లో గానీ  లేదా మరే   బ్రౌజ‌ర్ వాడితే లేదా వేరే యాప్స్ గాని వాడినా దానిలో మనము ఇంతకుముందు మనం వాడిన పదమును అది అక్కడ చూపిస్తుంది . దాన్ని మనం అవసరం అయితే మరల  టైపు చెయ్యకుండాదాన్నే వాడుకోవ‌చ్చు.ఇప్పటి వరకు ఇటువంటి  app స్మార్టు ఫోన్ లోను గని ఏ softwear కంపెనీ గానీ ఇటువంటి దీ తయారుచెయ్యలేదు . కానీ  గూగుల్ దీన్ని పరీక్షిస్తుంది. మరికొద్ది నెలల్లో యూజర్లకు అందుబాటులోకితెస్తుంది . 

Friday, 21 April 2017

ఇష్టమొచ్చింది షేర్ చేయొద్దు.. ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు

ఇష్టమొచ్చింది షేర్ చేయొద్దు.. ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు

సోషల్ మీడియా స్పీడు చాలా ఎక్కువ.  ఇలా పోస్టు చేస్తే అలా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. మంచైనా, చెడైనా నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. అది ఒక్కోసారి మేలు చేస్తున్నా ఒక్కోసారి మాత్రం కొంప ముంచుతోంది. సోషల్ మీడియాలో ‘ఫార్వర్డ్’, షేర్ వంటి ఆప్షన్లను కరెక్టుగా ఉపయోగించకపోతే ఎన్నో ఇబ్బందులు తప్పవు. ఇతరులకు ఇబ్బందులు కలగడమే కాకుండా ఒక్కోసారి అవి బూమరాంగ్ లా తిరిగి అవి కేసులుగా మారి మన మెడకే చుట్టుకునే ప్రమాదమూ ఉంది. అందుకే సోషల్ మీడియాలో కనిపించిందాంట్లో నిజానిజాలు తెలుసుకున్నాకే షేర్ చేయాలి. లేకపోతే ఇతరులు కానీ, మనం కానీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇలాంటి ధోరణి వల్ల ఇప్పటికే వందలాది మంది ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నరు, మహారాష్ర్ట మాజీ సీఎం, మాజీ కేంద్ర హోం మంత్రి అయిన సుశీల్ కుమార్ షిండే కుమార్తె ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. ఆమె తప్పేమీ లేకపోయినా నిందారోపణలు ఎదుర్కొంటున్నారు. సుశీల్ కుమార్ షిండే రెండో కుమార్తె ప్రీతి ష్రాఫ్ పై తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీని కంతటికి కారణం ఆమె ఇంటిపేరు ష్రాఫ్ అని ఉండడమే. గత సోమవారం పుణెలో ఫుట్ పాత్ పై నిల్చున్న వారిని ఓ మహిళ తన కారుతో ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆ యాక్సిడెంట్ కు పాల్పడిన మహిళ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య. ఆమె పేరు సుజాత జయప్రకాశ్ ష్రాఫ్. షిండే కూతురు ప్రీతి ఇంటి పేరు కూడా ‘ష్రాఫ్’ కావడంతో.. ఈ యాక్సిడెంటు ప్రీతి ష్రాఫ్ చేసినట్టుగా సామాజిక మాధ్యమాలు వేదికగా ఆమెపై తప్పుడు ప్రచారం జరిగింది. 

దీంతో, ప్రీతి, ఆమె భర్త మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో, ఆమెపై తప్పుడు ప్రచారానికి నెటిజన్లు స్వస్తి పలికారు. కాగా, ప్రీతి ష్రాఫ్ భర్త అయిన రాజ్ ష్రాఫ్ కాంగ్రెస్ నేత, వ్యాపారవేత్త. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, అసలు విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదని, నిజానిజాలు తెలుసుకోకుండా తమపై నిందలు వేయడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Thursday, 20 April 2017

వాట్స్అప్ లోమరో కొత్త ఫీచర్


వాట్స్అప్ యాప్ లోమరో   కొత్త ఫీచర్ ని యాడ్ చేస్తున్నారు 
ఇప్పటి రోజుల్లో  ఆండ్రాయిడ్   ఫోన్ లో మెసేజ్ యాప్ వాట్స్ అప్ వాడని వాళ్ళను అతి కొద్దిమంది ఉంటారు . యూత్ నుండి ఓల్డ్ ఏజ్ వాళ్లరకు ఎదో ఒక రూపంలోవాట్స్ అప్ ని వాడుతున్నారు అది మన దినచర్య  లో భాగం అయిపొయింది .. 
స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను  మధ్యనే  వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే .
ఇప్పడుమనముందుకు వీడియో  కాన్ఫరెన్స్ పేరుతో ఒక కొత్త ఫీచర్  తీసుకువస్తోంది.ఆకొత్త  ఫీచర్ వలన మనం ఒకేసారి ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకొనే అద్భుతమైన అవకాశం   
దీనిలో కల్పిస్తున్నారు.ఆల్రెడీ ట్రైల్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది.  వీళ్లు  వైఫై వాడుతున్న వారికి మరింత క్వాలిటీకోసం ఫీచర్‌ను మార్పులు చేస్తున్నారు .  మన ముందుకు కొద్దీ రోజులో ఇది రాబోతుంది .  


Wednesday, 19 April 2017

ట‌చ్ స్ర్కీన్ ఏటీఎం కార్డులు



పూర్వం బ్యాంకుకి వెళ్లి డబ్బులు తీసుకోవాలంటే  చాల ఇబ్బంది పడేవాళ్ళం .మనవెంట ఆ  డబ్బులు  దాయడానికి  ఒక  బ్యాగ్ పట్టుకెళ్లే వాళ్ళం దానితోడు ఒక లైన్ అది అప్పటి రోజులు  ఆ తరువాత టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కార్డులు వచ్చేయి.ఆ మనం బ్యాంకు వెళ్లకుండా కూడా మనం మార్కెట్ లో వస్తువులూ మనజేబులో డబ్బులు లేకపోయనకూడా తీసుకొనే విధంగా క్రెడిట్ కార్డులు కూడా బ్యాంకులు ఇస్తున్నాయి.
 ఇప్పుడు దానిని తలదన్నే విధంగా  మరో  అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నారు . అదే మల్టీ పుల్  బ్యాంకు అకౌంట్  ఒకే  కార్డు తో పాటు ట‌చ్ స్ర్కీన్ ఏటీఎంలు కార్డు  వస్తున్నాయి ఆ కార్డు వెన‌క భాగంలో మ‌న‌కు ట‌చ్ ఉంటుంది. ట‌చ్ స్ర్కీన్లో మనం బ్యాంకు కూడా ఎంపిక చేసుకోవ‌చ్చు. బ్యాంకు ఎంపిక చేసుకుని మ‌న‌కు కావాల్సిన సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. బ్యాంకు పేరు, కార్డు టైప్ , పిన్ ఎంట‌ర్ చేసి మ‌న‌కు కావాల్సిన సేవ‌ల‌ను ఎంట‌ర్ చేసి స్వైప్ చేసుకోవ‌చ్చు. ఐతే ఇది మరి కొద్దీ రోజుల్లో మనకు అందుబాటులోకి వస్తుంది

రిలయన్స్ జియో డీటీహెచ్ రంగంలోకి మే నుంచి సర్వీస్‌లు










రిలయన్స్ జియో టెలికాం రంగంలో తన సత్తా  చాటింది.   ఇప్పుడుడీటీహెచ్ రంగంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా పాగా వెయ్యాలనుకుంటుంది. తమ దగ్గ తగినన్ని సెట్ టాప్ బాక్స్‌లు ఉన్నాయి అని ఇప్పటికే  ప్రధాన నగరాల్లో పనులు ప్రారంభించినట్లు అధికారికంగా పేర్కొంది. ఇక మే నుంచి సర్వీస్‌నుప్రారంభిస్తాము అని ప్రకటించింది. సెట్ టాప్ బాక్స్‌ను ఇంటర్‌నెట్ సేవలకు అనుసంధానం చేసేందుకు వీలుగా రూపొందించినట్లు తెలిపింది.  వాటి ధరలు ఇలా   ఉన్నాయి ...   సెట్ టాప్ బాక్స్‌  ధర: 1800 రూపాయలు, జియో డీటీహెచ్ బుకింగ్: ఏప్రిల్ 2017, జియో డీటీహెచ్ లాంచ్ డేట్: మే 2017వాటి  బేసిక్  ప్లాన్ : 180 రూపాయలు.. నెలకు  అతి తక్కువలో   ఉండబోతున్నాయి అని ప్రకటించింది.  

 

టెలికాం రంగంలో జియో ఇక DTH వైపు అడుగులు




సుమారుగా గత సంవత్సర   కాలంగా  జియో నెట్వర్క్ మొబైల్ రంగం లో పెద్ద విప్లవం  తెచ్చింది . 4జి  ఫోన్ కలిగి ఉండి దానికి జియో సిమ్  తోడుడైతే ఫ్రీ గా నెట్ ఇంకా కాల్స్ ,మెస్సేజ్ లు ఫ్రీ గ పంపుకోవచ్చు అని జియో తెలిపింది . ఆ తరువాతమిగతా నెటవర్క్లో జరిగినది మనం చూసాము ఇప్పటికి చూస్తన్నాం .ఇప్పుడు మొబైల్ రంగం నుండి  DTH  మార్కెట్  పై  తన కన్ను పడిందో  అప్పటి నుండి  DTH  మార్కెట్ లో కొన్ని మార్పులు శతవేగంగా జరుగుతున్నాయి .. దానిలో ముందు  ఉన్ననెటవర్క్  Tata sky.  జియో రాకతో  డి2హెచ్‌ రంగంలోనూ పెను మార్పులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీ2హెచ్‌ సంస్థలు ఒకే సెట్‌టాప్‌ బాక్స్‌తో ఇటు ఇంటర్‌నెట్‌ను అటు కేబుల్‌ ప్రసారాలను అందించే ఎత్తుగడతో ముందుకు సాగుతున్నాయి.ఎందుకుఅంటే ఆయనెటవర్క్ పరిధి బట్టి వాళ్ళు తమవినియోగదారులను బయటకు వెళ్లకుండా ఉండటానికి కొన్ని మార్పులు చేస్తున్నారు వినియోగదారుల అభిరుచులు మారుతుండడం టీవీతో పాటు ఇంటర్‌నెట్‌ వినోదాన్ని వీక్షకులు కోరుకుంటుండడంతో  తప్పనిసరిగా మార్చే పరిస్తేతి ఏర్పడింది . త్వరలోనే రిలయన్స్‌ సంస్థ అతి తక్కువ ధరలకే సుమారుగా  300-450 లేదా ఆపై టీవీ ఛానెళ్ల ప్రసారాలతో పాటు ఇంటర్‌నెట్‌ సేవలను అందించే పరిజ్ఞానంతో డీ2హెచ్‌ సేవలను సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది . 

స్మార్టు ఫోన్ లో సిమ్ కార్డు వేయ‌కుండా చాటింగ్,వీడియో కాలింగ్ సదుపాయం ఇది మీకు తెలుసా




మనం ఏ ఫోన్ వాడాలన్న మనకు సిమ్  ప్రదానం ఇంకాసిగ్నల్  అదే లేకుండా ఫోన్ వాడేలాంతే మనం దానికి ఒక సదుపాయం ఉంది అది ఒక్క స్మార్టుఫోన్ కి మాత్రమే కానీ దానికి వైఫై మాత్రం ఖచ్చిత్తంగా ఉండాలి .SMS  లు వీడియో కాలింగ్ సదుపాయం కూడా ఉంది . దాని  వలన మనం బిల్లు  ఖర్చు తగ్గుతుంది ఐతే   ముందుగా   అన్‌లాక్ చేయ‌డం ఎలా ? దేనికి మనఫోన్ లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ  ఇన్సెర్ట్  సింకార్డ్  అనే దాన్ని   మార్చాలి .తరువాత మనం ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేస్తే మ‌ళ్లీ ఇన్‌స‌ర్ట్ సిమ్ కార్డు అనే ఆప్ష‌న్ మ‌న‌కు క‌న‌బ‌డ‌దు.
 వెబ్ బ్రౌజింగ్‌, డౌన్‌లౌడింగ్ ఫొటోస్‌, వీడియోలు అన్ని వైఫై ద్వారానే చేసుకోచ్చు. కానీ ఐ ఫోన్ల‌లోకొంచం ఇబ్బంది . కానీ దానికి ఒక పద్దతి ఉంది ఇన్‌స‌ర్టు సిమ్ కార్డు ఆప్ష‌న్‌ను అన్‌లాక్ చేయాలంటే ఎవ‌రి ద‌గ్గ‌రైనా సిమ్ తీసుకుని స‌ర్వీస్ యాక్టివేట్ చేయ‌డం ద్వారా మిగిలిన ఆప్ష‌న్లు వైఫై ద్వారా వాడుకోవ‌చ్చు. 

ప్ర‌పంచంలోనే అతి చిన్న ప్రింట‌ర్






ప్రంపంచం  లోనే అతి చిన్న  ప్రింట‌ర్ ను ‘డెస్క్‌జెట్‌ ఇంక్‌ అడ్వాంటేజ్‌ 3700’ పేరుతో హెచ్‌పీ ఇటీవల విడుదల చేసింది   దీని  ధర  మన రూపాయిలో 7,176 /-ఇంకు జెట్  ప్రింటర్ తో పోలిస్తే ఇది చాల చిన్నది .ఇది వై ర్ లెస్.  దీని కోసం వాళ్ళు ఒక అప్  కూడా తయారు చేసింది  హెచ్‌పీ సంస్థ . ఫేస్‌బుక్‌,  లాంటి ఇంకా మరి కొన్ని సామాజిక అనుసంధాన వేదికల్లోని ఫొటోల్నీస్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లలో ఈ ఆప్‌ ద్వారా ప్రింట్‌ తీసుకోవచ్చు.స్మార్ట్‌ ఫోన్‌ల వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకోసం ఈ ప్రింటర్‌ రూపొందించినట్లుహెచ్‌పీ కంపెనీ   చెబుతోంది..... అంతే కాదండోయ్ .వైర్ లెస్ ప్రింటింగ్ కోసం వైఫై కి సపోర్టు చేస్తుందికూడా . రూ .550 విలువ చేసే కాట్రిడ్జ్ తో సుమారు480 పేజీలను ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే ఒక మోనోక్రోమ్ ముద్రణ కయ్యే ఖరీదు ఒక రూపాయి. 403x177x141 M.M  డైమన్షన్స్ తో ఉన్న ఈ ప్రింటర్ బరువు 2.33 కిలోలు.ఆన్ లైన్ , ఆఫ్ లైన్, రీటైల్ స్టోర్లలో రెడ్, గ్రీన్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయ్ అని హెచ్‌పీ కంపెనీ   చెబుతోంది.

Sunday, 9 April 2017

4జీ ఫోన్.. 4 వేల లోపే


స్మార్ట్ ఫోన్‌.. అదీ 4జీ నెట్‌వ‌ర్క్‌ను స‌పోర్ట్ చేసే ఫోన్ కావాలంటే శామ్‌సంగ్‌, రెడ్‌మీ, లెనోవా.. ఇలా ఏ బ్రాండ్ చూసినా ఏడెనిమిది వేలు స్టార్టింగ్ రేంజ్ ఉంది. ఇప్పటివ‌ర‌కు 2జీ, 3జీ హ్యాండ్‌సెట్లు వాడుతున్నవారు 4జీకి అప్ గ్రేడ్ కావాల‌నుకున్నా ఈ ధరలు చూసి వెన‌కడుగు వేస్తున్నారు.  ముఖ్యంగా రూరల్ కంజ్యూమర్స్, లో ఇన్కమ్ గ్రూప్స్ లేటెస్టు 4జీ మొబైల్స్ కొనాలంటే భయపడుతున్నారు. ఇలాంటి వారికోసం రూ.4 వేల లోపే  4జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. మైక్రోమ్యాక్స్‌, శాన్‌సూయ్ లాంటి కంపెనీలు. ఒక మోస్తరు ఫీచర్లతో బేసిక్ స్మార్టు నీడ్స్ నెరవేరేలా 4జీ మొబైల్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. అలాంటివి కొన్ని మీకోసం..

1) శాన్‌సూయ్ హారిజాన్ - 1 


అఫర్డబుల్ ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ అందించే శాన్‌సూయ్ సంస్థ కొంత‌కాలంగా మొబైల్ మార్కెట్లో గ్రిప్ కోసం ట్రై చేస్తోంది. అందులో భాగంగానే ఇక్కడా అఫర్డబులిటీ కాన్సెప్ట్ తోనే 4జీ మొబైల్స్ తీసుకొస్తోంది.  ఈ కంపెనీ కొత్త 4జీ ఫోన్‌ను విడుదల చేసింది. 'హారిజన్ 1' పేరిట విడుదలైన ఈ ఫోన్ ను 3,999 రూపాయ‌ల‌కు ఫ్లిప్‌కార్ట్ లో కొనుక్కోవ‌చ్చు.
* డిస్‌ప్లే: 4.5 ఇంచ్
*  స్క్రీన్ రిజల్యూషన్ : 854x 480 పిక్సల్స్
* ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్
* ర్యామ్ : 1 జీబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ (32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ )
* ఓఎస్‌: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* సిమ్‌: డ్యుయల్ సిమ్
* కెమెరా: 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 3.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
* బ్యాట‌రీ: 2000 ఎంఏహెచ్

2) మైక్రోమ్యాక్స్ భారత్ 2 (క్యూ402) 


మైక్రోమ్యాక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'భారత్ 2 (క్యూ402)స‌ను ఇటీవ‌లే విడుదల చేసింది. ధ‌ర 3,499 రూపాయ‌లు.
* డిస్‌ప్లే: 4 ఇంచ్
* స్క్రీన్ రిజల్యూషన్ : 800 x 480 పిక్సల్స్
* ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్
* ర్యామ్ : 512 ఎంబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ (32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ )
* ఓఎస్‌: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* సిమ్‌: డ్యుయల్ సిమ్
* కెమెరా: 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
* బ్యాట‌రీ: 1300 ఎంఏహెచ్

3) స్వైప్ కనెక్ట్ నియో 4జీ 


చౌక ధ‌ర‌లో స్మార్ట్ ఫోన్లు అందించే స్వైప్ టెక్నాలజీస్ నుంచి వ‌చ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. పేరు 'కనెక్ట్ నియో 4జీస‌. రూ.3,999కు ఈ ఫోన్ దొరుకుతుంది.
* డిస్‌ప్లే: 4 ఇంచ్
* స్క్రీన్ రిజల్యూషన్ : 800 x 480 పిక్సల్స్
* ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్
* ర్యామ్ : 512 ఎంబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ (32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ )
* ఓఎస్‌: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* సిమ్‌: డ్యుయల్ సిమ్
* కెమెరా: 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 1.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ
* బ్యాట‌రీ: 2000 ఎంఏహెచ్