Wednesday, 19 April 2017

ప్ర‌పంచంలోనే అతి చిన్న ప్రింట‌ర్






ప్రంపంచం  లోనే అతి చిన్న  ప్రింట‌ర్ ను ‘డెస్క్‌జెట్‌ ఇంక్‌ అడ్వాంటేజ్‌ 3700’ పేరుతో హెచ్‌పీ ఇటీవల విడుదల చేసింది   దీని  ధర  మన రూపాయిలో 7,176 /-ఇంకు జెట్  ప్రింటర్ తో పోలిస్తే ఇది చాల చిన్నది .ఇది వై ర్ లెస్.  దీని కోసం వాళ్ళు ఒక అప్  కూడా తయారు చేసింది  హెచ్‌పీ సంస్థ . ఫేస్‌బుక్‌,  లాంటి ఇంకా మరి కొన్ని సామాజిక అనుసంధాన వేదికల్లోని ఫొటోల్నీస్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లలో ఈ ఆప్‌ ద్వారా ప్రింట్‌ తీసుకోవచ్చు.స్మార్ట్‌ ఫోన్‌ల వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకోసం ఈ ప్రింటర్‌ రూపొందించినట్లుహెచ్‌పీ కంపెనీ   చెబుతోంది..... అంతే కాదండోయ్ .వైర్ లెస్ ప్రింటింగ్ కోసం వైఫై కి సపోర్టు చేస్తుందికూడా . రూ .550 విలువ చేసే కాట్రిడ్జ్ తో సుమారు480 పేజీలను ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే ఒక మోనోక్రోమ్ ముద్రణ కయ్యే ఖరీదు ఒక రూపాయి. 403x177x141 M.M  డైమన్షన్స్ తో ఉన్న ఈ ప్రింటర్ బరువు 2.33 కిలోలు.ఆన్ లైన్ , ఆఫ్ లైన్, రీటైల్ స్టోర్లలో రెడ్, గ్రీన్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయ్ అని హెచ్‌పీ కంపెనీ   చెబుతోంది.

No comments:

Post a Comment