స్మార్ట్ ఫోన్.. అదీ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఫోన్ కావాలంటే శామ్‌సంగ్, రెడ్‌మీ, లెనోవా.. ఇలా ఏ బ్రాండ్ చూసినా ఏడెనిమిది వేలు స్టార్టింగ్ రేంజ్ ఉంది. ఇప్పటివరకు 2జీ, 3జీ హ్యాండ్‌సెట్లు వాడుతున్నవారు 4జీకి అప్ గ్రేడ్ కావాలనుకున్నా ఈ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా రూరల్ కంజ్యూమర్స్, లో ఇన్కమ్ గ్రూప్స్ లేటెస్టు 4జీ మొబైల్స్ కొనాలంటే భయపడుతున్నారు. ఇలాంటి వారికోసం రూ.4 వేల లోపే 4జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. మైక్రోమ్యాక్స్, శాన్‌సూయ్ లాంటి కంపెనీలు. ఒక మోస్తరు ఫీచర్లతో బేసిక్ స్మార్టు నీడ్స్ నెరవేరేలా 4జీ మొబైల్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. అలాంటివి కొన్ని మీకోసం..
1) శాన్‌సూయ్ హారిజాన్ - 1
అఫర్డబుల్ ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ అందించే శాన్‌సూయ్ సంస్థ కొంతకాలంగా మొబైల్ మార్కెట్లో గ్రిప్ కోసం ట్రై చేస్తోంది. అందులో భాగంగానే ఇక్కడా అఫర్డబులిటీ కాన్సెప్ట్ తోనే 4జీ మొబైల్స్ తీసుకొస్తోంది. ఈ కంపెనీ కొత్త 4జీ ఫోన్‌ను విడుదల చేసింది. 'హారిజన్ 1' పేరిట విడుదలైన ఈ ఫోన్ ను 3,999 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్ లో కొనుక్కోవచ్చు.
* డిస్‌ప్లే: 4.5 ఇంచ్
* స్క్రీన్ రిజల్యూషన్ : 854x 480 పిక్సల్స్
* ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్
* ర్యామ్ : 1 జీబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ (32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ )
* ఓఎస్: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* సిమ్: డ్యుయల్ సిమ్
* కెమెరా: 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 3.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
* బ్యాటరీ: 2000 ఎంఏహెచ్
2) మైక్రోమ్యాక్స్ భారత్ 2 (క్యూ402)
మైక్రోమ్యాక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'భారత్ 2 (క్యూ402)సను ఇటీవలే విడుదల చేసింది. ధర 3,499 రూపాయలు.
* డిస్‌ప్లే: 4 ఇంచ్
* స్క్రీన్ రిజల్యూషన్ : 800 x 480 పిక్సల్స్
* ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్
* ర్యామ్ : 512 ఎంబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ (32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ )
* ఓఎస్: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* సిమ్: డ్యుయల్ సిమ్
* కెమెరా: 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
* బ్యాటరీ: 1300 ఎంఏహెచ్
3) స్వైప్ కనెక్ట్ నియో 4జీ
చౌక ధరలో స్మార్ట్ ఫోన్లు అందించే స్వైప్ టెక్నాలజీస్ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. పేరు 'కనెక్ట్ నియో 4జీస. రూ.3,999కు ఈ ఫోన్ దొరుకుతుంది.
* డిస్‌ప్లే: 4 ఇంచ్
* స్క్రీన్ రిజల్యూషన్ : 800 x 480 పిక్సల్స్
* ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్
* ర్యామ్ : 512 ఎంబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ (32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ )
* ఓఎస్: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* సిమ్: డ్యుయల్ సిమ్
* కెమెరా: 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 1.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ
* బ్యాటరీ: 2000 ఎంఏహెచ్
No comments:
Post a Comment