SPEED ANDHRA
Friday, 9 December 2022
ప్రపంచం లో విలువైన కంపెనీ లు ఇవే అని మీకు తెలుసా ?
Monday, 8 November 2021
డ్రైవర్ కు సడెన్ గా గుండె నొప్పి వస్తే గుర్తించే కార్.........
Sunday, 16 May 2021
అమెజాన్ నుంచి మినీటీవీ వచ్చేసింది.
అమెజాన్ ఇప్పటికే 'ప్రైమ్' ద్వారా పలు భాషల్లోని సినిమాలతో పాటు, తమ ఒరిజినల్ కంటెట్స్ను వినియోగదారులకు అందిస్తుంది. అయితే ఈ సేవలను మన సబ్ స్క్రిప్షన్ ఆధారంగానే పొందుతాం. కానీ అమెజాన్ తాజాగా తీసుకొచ్చిన 'మినిటీవీ' మాత్రం పూర్తిగా ఉచితం. కానీ ఇందులో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి. 'మినిటీవి'ని అమెజాన్ షాపింగ్ యాప్ లో చూడొచ్చు. టీవీఎఫ్, పాకెట్ ఏసెస్ వంటి ప్రముఖ స్టూడియోలతో పాటు ఆశిష్ చంచలానీ, అమిత్ భదానా, రౌండ్ 2 హెల్, హర్ష్ బెనివాల్, శ్రుతి అర్జున్ ఆనంద్, ఎల్విష్ యాదవ్, ప్రజక్త కోలి, స్వాగర్ శర్మ, ఆకాష్ గుప్తా వంటి ప్రముఖ కమెడియన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్తో అమెజాన్ భాగస్వామ్యం చేసుకుంది. అంతేకాదు టెక్, ఫ్యాషన్, బ్యూటీ వంటి విషయాలకు సంబంధించిన ట్రెండిగ్ న్యూస్, టిప్స్ అందిస్తుంది.
ఈ సర్వీస్లో ఫుడ్ సెక్షన్ కూడా ఉండగా.. కబితా కిచెన్, కుక్ విత్ నిషా, గోబుల్ వంటి ఫేమస్ కుకరీ చానల్స్లోని వీడియోలను ఇందులో అందిస్తున్నారు. రాబోయే వారాల్లో మరెన్నో కొత్త, ప్రత్యేకమైన వీడియోలను జోడిస్తామని అమెజాన్ ప్రకటించింది. ఇక్కడ అమెజాన్ ప్రైమ్, మినీటివి రెండూ రెండు వేర్వేరు ప్లాట్ఫారమ్లు అని గమనించడం ముఖ్యం.
"మినీటివి పూర్తిగా ఉచితం, దీనికి ప్రత్యేక యాప్ అవసరం లేదు. మినీటి ప్రారంభించడంతో, అమెజాన్. ఇన్ షాపింగ్ యాప్ ఇక వినియోగదారులకు మిలియన్ల ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడానికి, మనీ ట్రాన్స్ఫర్ సేవలు వినియోగించడానికి మాత్రమే కాకుండా, ఉచిత వినోద వీడియోలను చూడటానికి ఒకే గమ్యస్థానంగా మారిపోయింది. ప్రస్తుతం, కొత్త వీడియో స్ట్రీమింగ్ సేవ Android వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. IOS మొబైల్ వెబ్ వెర్షన్లు కూడా రాబోయే నెలల్లో విడుదల చేస్తాం' అని కంపెనీ తెలిపింది.
Saturday, 15 May 2021
Friday, 14 May 2021
ఇక మీ కరెంట్ బిల్లు మేరే జనరేట్ చెయ్యొచ్చు...
జనరేట్ చేసుకోడానికి ఒక కొత్త యాప్ వచ్చింది .ఇక మనము అది ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఈ యాప్ ను ఏ విద్యుత్ పంపిణీ సంస్థ తయారు చేసారో చూద్దాం ...
అదే మన తెలుగు రాష్ట్రాల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎన్ఎస్పీడీసీఎల్) సంస్థ తయారు చేశారు.
వినియోగదారులకుఅర్థమయ్యేలా ఆ యాప్ లో డెమో వీడియోలను తెలుగులో అందుబాటులో ఉంచారు.
దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసా...
దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.
ఎలా వాడలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకోసం...
1)ముందుగా మీ ఫోన్ లో ఉన్న ప్లే స్టోర్ ను ఓపెన్ చెయ్యాలి.
2)ప్లే స్టోర్ లో TSSPDCC IT అని టైప్ చేసి తరువాత మీకు ఆ యాప్ కనిపిస్తోంది.
3)దాన్ని డౌన్లోడ్ చేసి తరువాత దాన్ని ఓపెన్ చేయాలి.
4)దానిలో మీ సర్వీస్ నెంబర్ ని కొట్టిన తరువాత మీ మొబైల్ నెంబర్ ను ఇంకా ఉంటే మీ మెయిల్ ఐడీ కూడా టైప్ చేయాలి.
5) ఆతరువాత మీ ఫోన్ లో మీరు ఎంటర్ చేసిన మీటర్ దగ్గరకు వెళ్ళండి.
6) KWH అని వస్తుంది అప్పుడేఆ రీడింగ్ ను స్కాన్ చెయ్యాలి. ముందుగా మీరు ఎంటర్ చేసినా దానికి ఇప్పుడు డి కరెక్టు అయితే నెక్స్ట్ అని వస్తుంది. ఆతర్వాత మీ బిల్లు వస్తుంది.
ఇంకో విషయం తెలుసుకోండి...
ఇంకేఎందుకు మీరు కూడా ఆ యాప్ ను మీ మొబైల్ లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
Saturday, 17 April 2021
మీ వాట్సాప్ లో ఈ లింక్ మీకు వచ్చిందా.....
ఎక్కువ మంది వాడే మెసెంజర్స్ లో ఎక్కువగా వాట్సాప్ ఉంటుంది ఐతే ఆ వాట్సాప్ కలర్ అంటే ముందుగా మనకు గుర్తుకు వస్తుంది ఫోన్ రిసీవర్ లోగో గ్రీన్ కలర్ లో కానీ ఇప్పుడు మరో కొత్త కలర్ లో మారుతుంది అని ఇప్పుడు కొన్ని లింకులు వాట్సాప్‌లో ఎక్కువగా కనబడుతుంది . ఆ లింకే Pink Whatsapp అని ఇప్పుడు తెగ చెక్కర్ లు కొడుతోంది . అయితే అది ఫేక్ లింక్ . అవి నిజం కావు, వాట్సాప్‌కి వాటికీ సంబంధం లేదని గతంలో చాలామంది టెక్ నిపుణులు హెచ్చరించారు.
అయితే విషయం తెలియని చాలామంది లింక్ ఓపెన్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి డేటాను ఆ దుండగులు కి తెలుస్తుంది . ఇది వైరస్ లింక్ అని జాగ్రత్తగా ఉండాలంటూ టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిగువన పెట్టిన ఫొటోలో కనిపిస్తున్నలింకు వాట్సప్‌లో కనిపిస్తుంది.
ఈ ఫేక్ లింక్ ని మీ కుటుంబ సభ్యులు గానీలేదా స్నేహితులు పంపినా కూడా క్లిక్ చేయొద్దు అసలు కొత్త వాట్సాప్ అంటూ ఏదైనా వస్తే గూగుల్ ప్లే స్టోర్ ద్వారానే వినియోగదారులకు అందిస్తుంది. ప్లే స్టోర్ లో యాప్ అప్డేట్ చేసుకుంటే మీకు వాట్స్అప్ అందించే కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
ఆ పింక్ వాట్సాప్ లింక్ ని ఓపెన్ చేస్తే మీ ఫోన్ ని వెంటనే ఫార్మేట్ చెయ్యండి అది ఎలా అంటే మీ ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని ఉంటుంది దాని పై క్లిక్ చేసే మీ ఫోన్ డేటా మొత్తం పోతుంది మళ్ళి ఫోన్ ఆన్ చేసిన తరువాత మీ ఫోన్ లో కొన్ని మెయిల్ ఐడిలు , బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్ లు మార్చుకుంటే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Monday, 22 March 2021
చార్జర్ ఇవ్వనందుకు యాపిల్ కంపెనీకి 15 కోట్ల ఫైన్
మొబైల్ కంపెనీలలో పెద్దదైన యాపిల్‌కు భారీ షాక్ తగిలింది . బ్రెజిల్‌లో ఒక కస్టమర్ యాపిల్ మొబైల్ ఫోన్ కొన్నారు . అందులో చార్జర్ లేదు.. దీంతో వెంటనే ఆ కస్టమర్ వినియోగాదారుల ఫోరమ్‌కు వెళ్లగా చార్జర్ ఇవ్వకుండా మొబైల్ అమ్మినందున యాపిల్ కంపెనీకి 15 కోట్లు భారీ జరిమానా వేసింది .
చార్జర్ ఇవ్వకపోతే ధర తగ్గించాలి కదా అంటూనే చార్జర్ కూడా ఇవ్వాలి అని ఫోరమ్ ప్రశ్నిస్తే దానిపై సదరు కంపెనీ నుండి ఎటువంటి జవాబు రాలేదు .
యాపిల్ గతంలో స్పందన
వీపీ లీసా జాక్షన్ గతంలో ఇప్పుడు అందరు వైర్‌లెస్‌కి అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు చార్జర్ ఇవ్వడం ఎందుకు అని వృధా కదా అని గతంలో చెప్పారు
కాగా దీనిపై ప్రోకాన్ SP executive director fernando capez స్పందిస్తూ దేశంలో వినియోగాదారుల చట్టాలున్నాయని గుర్తుచేశారు .
ఈ మధ్య చాల కంపెనీ లు చార్జర్ ఇవ్వకుండా మొబైల్ లు విక్రయిస్తాం అని గత కొద్దీ మాసాలుగా చెపుతున్నాయి .మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది చార్జర్లు ఇస్తే అంటూ నే పర్యావరణం లో కాలుష్యం తగ్గిచడానికి ఇలా చేస్తున్నాము అని కొన్ని మొబైల్ కంపెనీ లు చెపుతున్నాయి. ఐతే ఐతే ఇప్పుడు కంపెనీ లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.
Tuesday, 9 February 2021
రైతుల సమస్యలా మీ ఫోన్ లోనే పరిస్కారం .....
దేశం లోఅందరు రైతే రా రాజు అంటారు కానీ రైతు కోసం ఎవ్వరు చెయ్యరు ఇంకా టెక్నాలజీ లో కూడా రైతులకోసం చాలా ఆప్ లు ఇంకా తయారీ లో నే ఉన్నాయ్. ఆన్లైన్ లో తక్కువగా యాప్ ఉన్నాయ్ కానీ ఆన్లైన్ సలహాలు పెంచేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు మన శాస్త్రవేత్త లు.
మనదేశం లో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ,ఐఐటీ హైదరాబాద్ బాంబే ఐఐటీ సహకారంతో యాప్ రూపొందించారు. "క్రాప్ దర్పణ్" పేరుతో భారత్-జపాన్ జాయింట్ రీసెర్చ్ లేబొరేటరీ ప్రాజెక్టు కింద ఈ యాప్‌ను తీర్చిదిద్దారు.
ఐతే ఇది ముందుగా పత్తి పంట పై రైతుల్లో సమస్యలు, సలహాలు ,విత్తనాలు ఎప్పుడు వేయాలి, పోషకాలు ఎలా అందించాలో,తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబంధించిన అంశాలు ఈ యాప్ ద్వారా రైతులు కు ఇది ఉపయోగపడుతుంది .
ముందుగా ఆప్ ఓపెన్ చేసి మన సమస్యనుఅందులో నమోదు చేస్తే అందులోనే మన సమస్య కు జవాబు దొరుకుతుంది.
ముందుగా పత్తి పంట పై కొద్దీ రోజులో వరి పంట ను కూడా ఈ క్రాప్ దర్పణ్ ఆప్ లో వస్తుంది అని ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి తెలిపారు .
ఇది రెండు భాషల్లో అందుబాటులో ఉంది .ఇంగ్లిష్ ,తెలుగు , కొద్దీ రోజులో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీన్ని యువశాస్త్రవేత్త లు ఐన శ్రీనివాస్,అరవింద్ ,రేవంత్, సాయిదీప్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఈ యాప్ చేశారు.
పత్తి పంట పెరుగుదలను ప్రభావితం చేసే సమస్యలు, తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబంధించిన అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయ్ .
ఈ యాప్ ఈ వెబ్ సైట్ లో నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి.
https://www.cropdarpan.in/cropdarpan/
Saturday, 6 February 2021
యూట్యూబ్ క్లిప్స్.. ఇందులో ఏముంది.. ఎలా వాడాలి.. లైవ్ నుంచి వీడియో ఎలా కట్ చేసుకోవచ్చు
.
యూట్యూబ్ క్లిప్స్ ఇప్పుడు బీటా వెర్షన్ లోనే ఉంది. కొద్దీ మంది వినియోగదారులు, కొన్ని గేమింగ్ చానల్స్‌కు మాత్రమే ఇది వాడుతున్నారు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తగిన మార్పులు చేసి త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు.
ఈ ఫీచర్ తో ఇక మనకు లైవ్ స్ట్రీమ్స్ లో ఎక్కడి నుండి వీడియో నచ్చితే అక్కడి నుండి ఆ వీడియో కట్ చేసి 5 సెకన్ల నిడివి నుంచి 60 సెకన్ల వరకు మాత్రమే కట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు .
ఈ సదుపాయము ఆండ్రాయిడ్, వెబ్ వెర్షన్‌లకు వినియోగదారులకు మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది ఇక త్వరలో ఐవోఎస్ కస్టమర్స్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది యూట్యూబ్.
ఎలావాడాలి ,షేర్ చెయ్యాలి అంటే ?
ముందుగా మన ఫోన్ లో లేదా సిస్టం లో యూట్యూబ్ ను ఓపెన్ చెయ్యాలి.
అందులో లైవ్ లేదా వీడియో గని ఓపెన్చెయ్యాలి
ఆతరువాత ఆ వీడియో ప్లే చేసి మనకు నచ్చిన సమయం లో సీజర్ సింబల్ కనిపిస్తుంది.
దాని మీద క్లిక్ చేస్తే.. ‘క్రియేట్ క్లిప్’ కనిపిస్తుంది.
అప్పుడు మనకు నచ్చిన వీడియో పైన చెప్పిన సమయం ( 5 నుంచి 60 సెకన్ల ) వరకు కట్ అవుతుంది.
దాన్ని వాట్సాప్,టెలిగ్రామ్ ,సిగ్నల్ ఫేస్‌బుక్, ట్విట్టర్ లో షేర్ చేసుకోవచ్చు.
ఈ వీడియోలు షేర్ అవ్వవు....
ప్రైవేట్ అని రాసి ఉన్న క్లిప్స్, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌తో పాటు, కిడ్స్ మేడ్ వీడియోలకు మాత్రం ఈ యూట్యూబ్ క్లిప్స్ షేర్ చేయడానికి వీలు లేదు.
యూట్యూబ్ క్లిప్స్ వాడాలి అంటే ముందుగా మీ సిస్టం , ఆండ్రాయిడ్ లో బెటా వెర్షన్ అయి ఉండాలి . అది తెలుసుకోవాలి అంటే వీడియో క్లిప్ ఐకాన్ కింద కత్తెర సింబల్ కనిపిస్తుంది అప్పుడు మాత్రమే వీడియోస్ షేర్ అవుతుంది .
అప్పుడు మాత్రమే మీరు వాడేది బీటా వెర్షన్ నా కాదా అని తెలుస్తుంది.
పేపాల్..ఏప్రిల్ 1 నుంచి భారత్ లో సర్వీసులను నిలిపివేస్తోంది..
అమెరికాకు చెందిన డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేపాల్ ఇక భారత్ లో ఏప్రిల్ 1 నుండి పేమెంట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది .
పేపాల్ ఇక అంతర్జాతీయ వ్యాపారాలపై దృష్టి తో ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇప్పటికే ఈ సంస్థకు చెన్నై,హైదరాబాద్, బెంగళూరుసెంటర్ల ఉన్నాయి. ఈ సెంటర్లలో బిజినెస్ డెవలప్‌మెంట్ టీం కలిగి ఉంది .
ప్రపంచవ్యాప్తంగా వీరికి 350 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు ఐతే వీరు మన దేశం లో పెట్టుబడులు పెడితే ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు పెరిగే అవకాశం ఉంది అని కంపెనీ భావిస్తుంది .
Saturday, 30 January 2021
గూగుల్ హోం, అమెజాన్ ఎకో: ఇవి ఎలా పనిచేస్తాయి.. వీటి వల్ల ఉపయోగాలేంటి.. ఇంట్లోని స్మార్ట్ డివైస్‌లన్నీ కంట్రోల్ చేయగలమా
స్మార్ట్ స్పీకర్స్ ఎప్పుడైతే ఇవి మన ఇంట్లోకి వచ్చాయో.. అప్పటి నుంచీ ఇతర స్మార్ట్ డివైసెస్ రావడం మొదలైంది. ఇప్పుడీ స్మార్ట్ స్పీకర్స్ కేవలం మ్యూజిక్‌కే పరిమితం కావడం లేదు.. అందులోని వర్చువల్ అసిస్టెంట్ మనం చెప్పిన పనులన్నీ చేసి పెడుతోంది. మన వాయిస్‌ను గుర్తించి అందుకు తగినట్లుగా స్పందించడం ఈ స్మార్ట్ స్పీకర్స్ ప్రత్యేకత. పైగా ఇంట్లోని అన్ని స్మార్ట్ వస్తువులను ఈ స్పీకర్స్ కంట్రోల్ చేయగలవు. టాప్ కంపెనీలన్నింటికీ వర్చువల్ అసిస్టెంట్స్ ఉన్నాయి.
గూగుల్ అయితే గూగుల్ అసిస్టెంట్, అమెజాన్‌కు అలెక్సా, ఆపిల్‌కు సిరి, మైక్రోసాఫ్ట్‌కు కోర్టానాలాంటి వర్చువల్ అసిస్టెంట్స్ ఉన్నాయి. అయితే మన దగ్గర మాత్రం గూగుల్ హోమ్, అమెజాన్ ఎకో.. ఈ స్మార్ట్ స్పీకర్స్ మార్కెట్‌ను ఏలుతున్నాయి.
గూగుల్ హోమ్
గూగుల్ హోమ్ లోనే వివిధ రకాల డివైసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అన్నింటి కంటే చిన్నది గూగుల్ హోమ్ మినీ. దీని సైజు, ధర రెండూ తక్కువే. ఓ డోనట్ షేపులో ఉండే ఈ గూగుల్ హోమ్ మినీ గ్రే, బ్లాక్ కలర్స్‌లో రూ. 3,999 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
ఇక గూగుల్ హోమ్ విషయానికి వస్తే దీని ధర రూ.7,999గా ఉంది. ఇది సిలిండ్రికల్ షేపులో ఉంటుంది. ఇది రెండూ చేసే పనులు ఒకటే. కాకపోతే సౌండ్ క్లారిటీ, సైజు, ధరల్లో మాత్రమే తేడా ఉంటుంది. డిస్‌ప్లే ఉన్నది కావాలంటే గూగుల్ నెస్ట్ హబ్‌కి వెళ్లొచ్చు. 7 అంగుళాల టచ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో వీడియోలు, ఫొటోలు చూసుకోవచ్చు. ఓకే గూగుల్ అంటూ ఇంట్లోని స్మార్ట్ డివైసెస్‌ను కంట్రోల్ చేయొచ్చు.
ఒకవేళ స్మార్ట్ డోర్‌బెల్ ఇంట్లో ఉన్నట్లయితే.. దాంతో కనెక్ట్ చేసి బయట ఎవరు వచ్చారన్నది ఈ గూగుల్ నెస్ట్ హబ్‌లో చూసుకునే వీలుంటుంది. దీని ధర రూ. 9,999గా ఉంది. ఇందులోనే గూగుల్ నెస్ట్ హబ్ మ్యాక్స్ కూడా వచ్చింది. ఇందులో పది అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది.
అమెజాన్ ఎకో
అమెజాన్ ఎకో తొలిసారి 2014లో లాంచ్ అయింది. తాజాగా అమెజాన్ థర్డ్ జనరేషన్ ఎకోను 2019 సెప్టెంబర్‌లో రిలీజ్ చేసింది. గూగుల్ హోమ్‌లాగే ఇది కూడా సిలిండ్రికల్ షేప్‌లోనే ఉంటుంది. కాకపోతే పైన ఫ్లాట్‌గా ఉంటుంది. హీథర్ గ్రే, సాండ్‌స్టోన్, చార్‌కోల్, ట్విలైట్ బ్లూ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది. ఎకోతోపాటు ఎకో డాట్, ఎకో షో, ఎకో స్పాట్‌లు కూడా ఉన్నాయి.
గూగుల్ హోమ్ మినీలాగా ఇందులో అమెజాన్ ఎకో డాట్ ఉంటుంది. చూడటానికి అచ్చూ అలాగే కనిపిస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ. 2,449గా ఉంది. ఇక ఎకో థర్డ్ జనరేషన్ ధరను రూ. 9,999గా నిర్ణయించారు. సెకండ్ జనరేషన్ కావాలన్నా అమెజాన్ వెబ్‌సైట్‌లో కొనుక్కోవచ్చు. దీని ధర రూ. 6,999.
ఇక డిస్‌ప్లే కావాలనుకుంటే అమెజాన్‌లో ఎకో షో 5 ఉంది. దీని ధర రూ. 5,499. 5.5 అంగుళాల టచ్ స్క్రీన్ ఇందులో ఉంటుంది. ఇది సేమ్ గూగుల్ నెస్ట్ హబ్‌లాగే పని చేస్తుంది. వీడియో కాల్స్ చేసుకోవచ్చు, స్మార్ట్ డోర్‌బెల్‌తో కనెక్ట్ చేయొచ్చు.
ఓకే గూగుల్ ..
ఇంట్లో కూర్చున్న చోటు నుంచి కదలకుండా మీరు చెప్పే పనులన్నీ ఈ స్మార్ట్ స్పీకర్స్ చేసి పెడతాయి. మొదట్లో కేవలం మ్యూజిక్ వినిపించడానికి పరిమితమైన ఈ స్పీకర్స్.. రానురాను ఒక్కో ఫీచర్‌ను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇవి చేసే పనులేంటో ఇప్పుడు చూద్దాం.
మ్యూజిక్
గూగుల్ హోమ్ అయినా, అమెజాన్ ఎకో అయినా మ్యూజిక్ వినడానికి బాగా పనికొస్తాయి. ఇవి రెండూ వివిధ స్ట్రీమింగ్ సర్వీస్‌ల నుంచి మ్యూజిక్‌ను ప్లే చేయగలవు. జస్ట్.. మీకు కావాల్సిన పాటను వాయిస్ కమాండ్ ద్వారా చెబితే చాలు.
గూగుల్ హోమ్ అయితే గూగుల్ ప్లే మ్యూజిక్‌తోపాటు స్పాటిఫై, పాండోరా, యూట్యూబ్‌లలో నుంచి సాంగ్స్‌ను సెలక్ట్ చేసి వినిపిస్తుంది. అదే ఎకో అయితే అమెజాన్ మ్యూజిక్‌తోపాటు ఇతర స్ట్రీమింగ్ సర్వీసుల్లో వెతుకుతుంది. మీకు నచ్చిన స్ట్రీమింగ్ సర్వీస్‌ను డిఫాల్ట్‌గా సెట్ చేసి పెట్టుకోవచ్చు. ముందుగా ఇవి అందులోనే వెతుకుతాయి.
వీటి సౌండ్ మీకు నచ్చకపోతే.. ఇతర స్పీకర్లతోనూ లింక్ చేయొచ్చు. గూగుల్ అయితే క్రోమ్‌క్యాస్ట్ లేదా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. క్రోమ్‌కాస్ట్ ఉంటే మీ టీవీలోనూ గూగుల్ అసిస్టెంట్ మ్యూజిక్ ప్లే చేస్తుంది.
అలాగే వివిధ ఓటీటీ సర్వీస్‌ల నుంచి మీకు నచ్చిన షోను కూడా ప్లే చేసుకోవచ్చు. ఎల్జీ, సోనీలాంటి కంపెనీలు ఇప్పటికే బిల్టిన్ గూగుల్ అసిస్టెంట్‌తో కొన్ని టీవీలను రిలీజ్ చేశాయి.
మీ అసిస్టెంట్
గూగుల్ హోమ్ లేదా అమెజాన్ ఎకో .. ఇవి రెండూ మీ పర్సనల్ అసిస్టెంట్‌లా మీరు చెప్పిన పని చేస్తాయి. మీరు రెగ్యులర్‌గా చేసే చిన్న చిన్న పనులు అంటే.. వెబ్‌లో వెతకడం, బయట వాతావరణ సమాచారం ఇవ్వడం, ఈకామర్స్ సైట్లలో వస్తువులు కొనుగోలు చేయడంలాంటివి చేసి పెడతాయి.
గూగుల్ హోమ్‌లోని గూగుల్ అసిస్టెంట్ అయితే గరిష్ఠంగా ఇంట్లోని ఆరుగురు వ్యక్తుల గొంతులను గుర్తు పట్టగలదు. ఎవరు మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి.. వాళ్లకు తగిన సమాచారం ఇస్తుంది. ఉదాహరణకు ఉదయం నిద్ర లేవగానే ఓకే గూగుల్ .. గుడ్ మార్నింగ్ అని చెప్పగానే వాతావరణం వివరాలు, మీ షెడ్యూలు వివరాలు చెప్పేస్తుంది. గూగుల్ క్యాలెండర్ లో మీరు షెడ్యూలు చేసుకున్న అపాయింట్మెంట్లు, ఇతర వివరాలను చెప్పేస్తుంది.
ఎవరి వాయిస్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి ఆ మేరకు సమాచారం అందిస్తుంది. ఎవరి ప్రొఫైల్ వాళ్లు క్రియేట్ చేసుకోవచ్చు. మీ వాయిస్‌ని బట్టి గూగుల్ హోమ్ వాయిస్ కూడా మార్చుకునే వీలుంటుంది.
పైగా ఫిమేల్ వాయిసే కాకుండా మేల్ వాయిస్‌లోకి కూడా గూగుల్ హోమ్‌ని మార్చుకోవచ్చు. ఈ ఫీచర్స్ అమెజాన్ ఎకోలో ప్రస్తుతానికి అందుబాటులో లేవు. పైగా గూగుల్ హోమ్ తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లోనూ మాట్లాడగలదు. ఎకో ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీకే పరిమితమైంది. ఇతర భాషలపైనా అమెజాన్ దృష్టి సారిస్తోంది.
ఇతర పనులు
– గూగుల్ హోమ్, అమెజాన్ ఎకో బ్రాడ్‌కాస్టింగ్‌కు బాగా పనికొస్తాయి. అంటే ఈ స్మార్ట్ స్పీకర్స్‌లో మీరు ఏదైనా అనౌన్స్ చేస్తే.. ఇంట్లో ఉన్న అన్ని కనెక్టెడ్ స్పీకర్స్‌లో దానిని ప్లే చేస్తుంది. అవతలి వ్యక్తికి మీ వాయిస్ కమాండ్ ద్వారానే మీరు రిప్లై కూడా ఇవ్వొచ్చు.
– ఇక వంట రానివారికీ కిచెన్‌లో సాయం చేస్తుంది. ఏదైనా వంటను స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తుంది. కావాలంటే ముందుకు, వెనక్కి వెళ్లి మళ్లీ మళ్లీ వినొచ్చు.
– గూగుల్ హోమ్‌కైతే ఒకేసారి వరుసగా రెండు వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు. గూగుల్ అసిస్టెంట్ మీరు అడిగిన ప్రశ్నలకు వరుసగా సమాధానం ఇస్తుంది. అమెజాన్ ఎకోలో ఈ ఆప్షన్ లేదు. ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చిన తర్వాత మరో ప్రశ్న అడగాల్సి ఉంటుంది.
– ఇక ఇవి రెండూ టైమ్‌కు తగినట్లుగా తమ వాయిస్‌ను కంట్రోల్ చేసుకుంటాయి. రాత్రి సమయంలో ఇతరులెవరికీ ఇబ్బంది కలగకుండా తమ వాల్యూమ్ తగ్గించుకుంటాయి.
– మీ మూడ్ బాగా లేకపోతే జోకులు కూడా వినిపించి నవ్విస్తాయి. హోమ్ అయినా, ఎకో అయినా.. జస్ట్ టెల్ మీ ఎ జోక్ అంటే చాలు.. మిమ్మల్ని నవ్వించడానికి ఎన్నో జోక్స్‌ను సిద్ధంగా ఉంచుతాయి.
– ట్రాఫిక్ సమాచారం అందిస్తాయి. ప్రతి రోజూ ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లే దారిని సెట్ చేసి పెడితే చాలు.. ఆఫీస్‌కు వెళ్లే సమయంలో ఆ రూట్‌లో ట్రాఫిక్ సమాచారాన్ని ఈ స్మార్ట్ స్పీకర్స్‌ను అడిగి తెలుసుకోవచ్చు.
– క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో ఉన్న ఓలా లేదా ఊబర్ లేదా ఏ ఇతర క్యాబ్ సర్వీసునైనా సరే గూగుల్ హోమ్ లేదా అలెక్సాకు లింక్ చేస్తే.. మీకు అవసరమైనప్పుడల్లా క్యాబ్ బుక్ చేసి పెడుతుంది.
– లొకేషన్ ఆధారంగా పని చేస్తాయి కాబట్టి.. మీకు దగ్గర్లో ఉన్న స్టోర్లు, రెస్టారెంట్లు, హాస్పిటల్స్ సమాచారం కూడా అందిస్తాయి. అవి ఎక్కడ ఉన్నాయి.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెరిచి ఉంటాయి వంటి డిటేల్స్ ఇస్తాయి.
– నెలవారీ ఇంట్లోకి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం మనకు అలవాటు. అయితే ఈ లిస్ట్ అప్పటికప్పుడు గుర్తుకు రాదు. తరచూ ఏదో ఒక వస్తువు మరచిపోతూనే ఉంటాం. ఇలాంటి సమయంలో ఇంట్లో ఏదైనా అయిపోగానే దానిని ఈ స్మార్ట్ స్పీకర్స్ చెవిలో వేసి ఉంచితే.. వాటిని షాపింగ్ లిస్ట్‌లో యాడ్ చేసి పెడుతాయి.
గూగుల్ కే పరిమితమైన సేవలు
ఇక గూగుల్ హోమ్‌కు మాత్రమే పరిమితమైన మరికొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవి అమెజాన్ ఎకోలో ఇంకా అందుబాటులోకి రాలేదు.
– గూగుల్ అసిస్టెంట్ తెలుగు సహా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోకి వచ్చేసింది. ఇంగ్లిష్, హిందీతోపాటు ఈ భాషల్లోనూ గూగుల్ హోమ్‌తో కమ్యూనికేట్ కావచ్చు. అదే అమెజాన్‌లో ఇంగ్లిష్ కాకుండా కేవలం హిందీ మాత్రమే అందుబాటులో ఉంది.
– గూగుల్ హోమ్ ద్వారా వాట్సాప్ మెసేజ్‌లు కూడా పంపే వీలుండటం విశేషం. ఒకసారి మీ వాట్సాప్ అకౌంట్‌ను హోమ్‌తో లింక్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత నుంచి మీ కాంటాక్ట్‌లోని ఎవరికైనా వాయిస్ కమాండ్ ద్వారా వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. ఈ ఫీచర్ అమెజాన్ అలెక్సాలో ఇంకా అందుబాటులోకి రాలేదు.
– మనం తరచూ ఇంట్లో ఫోన్ ఎక్కడో పెట్టి మరచిపోతుంటాం. ఇలాంటి సమయంలో గూగుల్ హోమ్ దానిని వెతికి పెడుతుంది. ఇది ఎలా పని చేస్తుందంటే.. ముందుగా ఐఎఫ్‌టీటీటీ యాప్ ద్వారా గూగుల్ హోమ్‌కు కనెక్ట్ కావాలి. ఆ తర్వాత ఎప్పుడైనా ఫోన్ వెతకాలి అనుకుంటే.. ఓకే గూగుల్, ఫైండ్ మై ఫోన్ అని చెబితే చాలు.. మీ ఫోన్‌కు అలర్ట్ రింగ్ పంపిస్తుంది.
– ఇక హోమ్‌లో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. అలెక్సా కంటే ఎంతో మెరుగ్గా వెబ్‌లో సమాచారం వెతికి పెడుతుంది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో గూగుల్ హోమ్ చాలా ముందు ఉంటుంది.
లేటెస్ట్‌గా 360ఐ చేసిన అధ్యయనంలో ఈ రెండింటినీ 3 వేల ప్రశ్నలు అడిగారు. ఇందులో గూగుల్ 72 శాతం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా.. అలెక్సా మాత్రం కేవలం 13 శాతానికే పరిమితమైంది. అంటే సుమారు ఆరు రెట్లు మెరుగైన పనితీరు గూగుల్ హోమ్ కనబరచింది.
స్మార్ట్ డివైసెస్ కంట్రోల్
అసలు మన ఇళ్లు మెల్లగా స్మార్ట్ అవుతున్నాయంటే కారణం ఈ స్మార్ట్ స్పీకర్సే. మనకు రోజువారీ పనుల్లో సాయపడుతున్న ఈ స్పీకర్స్.. ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైస్‌లనూ కంట్రోల్ చేయగలవు. ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న ప్రతి స్మార్ట్ డివైస్‌ను గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాలకు లింక్ చేయొచ్చు.
ఇంట్లోని స్మార్ట్ బల్బ్స్, స్మార్ట్ ప్లగ్స్, స్మార్ట్ స్విచెస్, స్మార్ట్ టీవీస్, స్మార్ట్ లాక్, సెక్యూరిటీ కెమెరాలు, థర్మోస్టాట్లు.. ఇలా దాదాపు ప్రతి స్మార్ట్ డివైస్‌కూ వీటి ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చుకోవచ్చు.
అమెజాన్ ఎకో అయితే దాదాపు 60 వేల స్మార్ట్ డివైస్‌లతో పని చేయడం విశేషం. అదే గూగుల్ హోమ్ అయితే 30 వేల డివైస్‌లను కంట్రోల్ చేయగలదు.
మీకు కూడా వర్చువల్ అసిస్టెంట్ కావాాలా? మరింకెందుకు ఆలస్యం ఓకే గూగుల్ లేదా అలెక్సా అని పిలవడం అలవాటు చేసుకోండి.
ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, వ్యాలట్, ఫోన్ పే, గూగుల్ పే... ఏవీ అవసరం లేదు.. చాలా సింపుల్‌గా పేమెంట్ అయిపోతుంది
సారా స్టివార్ట్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో ఒక చిన్న మెక్సికన్ రెస్టారెంట్‌కి వచ్చారు. ఒక సాండ్‌విచ్ కావాలని ఆర్డర్ చేశారు.
బిల్లు కట్టటానికి క్యాషియర్ కౌంటర్ దగ్గరకు వెళ్లారు. అక్కడున్న ఒక చిన్న ఎల్‌సీడీ స్క్రీన్‌లో తన ముఖం ప్రతిబింబం చూసుకున్నారు. అంతే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి బిల్లు డబ్బులు కట్టయ్యాయి.
టిప్ ఇవ్వటానికి అదే స్క్రీన్ ముందు చేతితో చిన్న సంజ్ఞ చేశారు. ఆ టిప్ మొత్తం కూడా ఆమె అకౌంట్ నుంచి కట్ అయింది.
కేవలం ఐదు సెకన్లలో ఈ మొత్తం ప్రక్రియ పూర్తయింది. ఎక్కడా భౌతిక స్పర్శ లేదు. పైగా సారా తన మొబైల్ ఫోన్ కానీ, ఏటీఎం కార్డు కానీ వెంట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
అలాగని ఎలాంటి గుర్తింపూ చూపాల్సిన పనీ లేదు. కనీసం పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఎంటర్ చేయనక్కరలేదు.
ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ కాదు. ఈ టెక్నాలజీని ఇప్పటికే ప్రతి రోజూ లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు.
ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ చరైనాలోని ప్రధాన నగరాల్లో సాధారణ వినియోగంలోకి వచ్చేసింది.
ఈ టెక్నాలజీని ఇప్పుడు అమెరికాలో ప్రవేశపెడుతున్నారు. డెన్మార్క్, నైజీరియా వంటి దేశాల్లోనూ అమలులోకి తెస్తున్నారు.
అంటే మరికొన్ని సంవత్సరాల్లో మనందరం ఈ టెక్నాలజీనే వాడబోతున్నామా? మరైతే దీనివల్ల సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత సమస్యలు ఉన్నాయా?
తనకు అటువంటి ఆందోళనలేవీ లేవంటారు 18 సంవత్సరాల సారా స్టివార్ట్. ‘‘టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటువంటి సాంకేతికతను ఉపయూగించే ముందు రెండోసారి ఆలోచించే సావకాశమే ఉండదని నా అభిప్రయం’’ అంటారీ యూనివర్సిటీ విద్యార్థిని.
‘‘ఇప్పటికే మన ఫోన్లు మన ముఖాలను గుర్తిస్తాయి. మన ముఖాలు ఇంటర్నెట్ అంతటా చేరిపోయాయి. అలాంటపుడు ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఎవరి భద్రతకైనా కొత్తగా ఏదైనా సమస్య తలెత్తుతుందని నేను అనుకోను’’ అని అభిప్రాయపడ్డారు.
‘‘ఇది చాలా వేగవంతమైన విధానం. సౌకర్యవంతమైనది, సురక్షితమైనది కూడా. పైగా ఫోను, ఏటీఎం కార్డు ఇంటి దగ్గర వదిలేసి వచ్చామనే ఆందోళన కూడా ఉండదు’’ అని చెప్పారు సారా.
అమెరికాకు చెందిన ‘పాప్ఐడీ’ అనే ఒక టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ద్వారా ఆమె ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ విధానాన్ని వాడుతున్నారు. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో మీ ముఖం ఫొటో అప్‌లోడ్ చేయటం ద్వారా సైనప్ కావాలి. అది సంస్థ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్‌లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మీ అకౌంట్‌ను మీ ఏటీఎం కార్డుకు అనుసంధానించాలి.
ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్’కు అదనంగా పాప్‌ఐడీలో లభ్యమయ్యే చేతి సంజ్ఞలతో టిప్ ఇచ్చే టూల్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. సారా స్టివార్ట్ తను ఇవ్వాలనుకున్న టిప్ మొత్తానికి కొన్ని సంజ్ఞలు సెట్ చేసుకున్నారు. థంబ్స్ అప్ సంజ్ఞతో 10 శాతం టిప్, పీస్ సంజ్ఞతో 15 శాతం, శాకా లేదా ‘హ్యాంగ్ లూజ్’ సంజ్ఞతో 20 శాతం టిప్ ఇచ్చేలా సెట్టింగ్ పెట్టుకున్నారు.
పాప్ ఐడీ ప్రధాన కార్యాలయం లాస్ ఏంజెలెస్‌లో ఉంది. అమెరికాలోని పలు నగరాల్లో, ముఖ్యంగా పశ్చిమ తీర నగరాల్లోని దాదాపు 70 శాతం స్వతంత్ర రెస్టారెంట్లు ఇప్పుడు పాప్‌ఐడీని వాడుతున్నాయి.
‘‘చెల్లింపులు చేయటానికి మీ ముఖాన్ని వాడటానికి, మీ ఫోన్‌ను వాడటానికి మధ్య ఏం తేడా లేదు అనేది మా అభిప్రాయం’’ అని పాప్ఐడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ మిల్లర్ పేర్కొన్నారు.
‘‘పాయింట్ ఆఫ్ సేల్ వద్ద తీసుకున్న డిజిటల్ ఫొటో వెంటనే ధ్వంసమైపోతుంది. నమోదైన డాటాను ఎవరితోనూ షేర్ చేయం’’ అని ఆయన వివరించారు.
నిజానికి మొబైల్ ఫోన్ చెల్లింపులకన్నా ఈ విధానంలో చెల్లింపుల్లో వ్యక్తిగత గోప్యత ఎక్కువగా ఉంటుందని ఆయన వాదిస్తున్నారు. ఎలాగంటే మొబైల్ ఫోన్ ఎల్లప్పుడూ జీపీఎస్ ద్వారా మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదని ఉటంకిస్తున్నారు.
పాప్ఐడీ స్టోర్ చేసే ఫొటోలు.. విశిష్టమైన ముఖ ఆకృతుల మాథమెటికల్ మ్యాప్‌లని.. నిజమైన ఫొటోగ్రాఫ్‌లు కాదని ఆయన చెప్పారు.
ప్రస్తుతం పాప్‌ఐడీ యూజర్లు తమ ఫేస్‌మాస్కుని తాత్కాలికంగా కిందికి దించాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో అలా చేయాల్సిన అవసరం లేకుండా ఉండేలా సిస్టమ్‌ని అప్‌డేట్ చేస్తున్నట్లు ఆ సంస్థ చెప్తోంది.
లాస్ ఏంజెలెస్ నుంచి సుమారు 12,000 కిలోమీటర్ల దూరంలో చైనాలోని గ్వాంఝూ నగరంలో మరో విద్యార్థిని ఫేషియల్ పేమెంట్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారు. సన్ యట్ సేన్ యూనివర్సిటీలో తన వసతి ప్రాంతంలోని వెండింగ్ మెషీన్ వద్ద ఆహారం కొనుగోలు చేయాలంటే ఇదొక్కటే పద్ధతి అని లింగ్ (ఇబ్బందులు వస్తాయనే భయంతో తన అసలు పేరు వెల్లడించటానికి సిద్ధంగా లేరు) చెప్పారు.
ఈ టెక్నాలజీ వినియోగం విషయంలో లాస్ ఏంజెలెస్‌లో సారా సంతోషానికి పూర్తి భిన్నంగా ఉంది లింగ్ అభిప్రాయం. ఇది తన రోజు వారీ జీవితంలోకి మరింతగా చొచ్చుకురావటమేనని ఆందోళన చెందుతున్న ఆమె.. దీనిని వినియోగించటానికి తిరస్కరిస్తున్నారు. అందువల్ల రాత్రిపూట తాను ఆహారం కొనలేకపోయినా ఫర్వాలేదని చెప్తున్నారు.
‘‘టెక్నాలజీ అనేది ఒక కెరటం లాంటిది. దానికి ఎదురీదగలగటమనే ప్రసక్తే లేదు. కానీ నాకు సాధ్యమైనంత వరకూ నేను ఒక వైఖరిని కూడా అవలంబించాలని భావిస్తున్నా’’ అని ఆమె చెప్పారు.
టెక్నాలజీ అనేది నిజంగా ఒక కెరటం అనుకుంటే.. చైనాలో ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ టెక్నాలజీని అమలు చేయటం సునామీ వంటిదిగా భావించవచ్చు.
చైనాలో జరిగే మొబైల్ పేమెంట్లన్నీ దాదాపుగా (98 శాతం) కేవలం రెండు యాప్‌ల – అలీపే (ఈకామర్స్ జెయింట్ అలీబాబా యాజమాన్యంలోనిది), వీచాట్ పే – ద్వారానే జరుగుతున్నాయి. ఈ రెండు యాప్‌లూ దేశవ్యాప్తంగా తమ సిస్టమ్‌లలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇన్‌స్టాల్ చేయటానికి పోటీపడుతున్నాయి.
ఇందుకోసం అలీపే రెండు సంవత్సరాల్లో 300 కోట్ల యువాన్లు (42 కోట్ల డాలర్లు) ఖర్చుపెడుతోంది. వచ్చే ఏడాది నాటికి దేశంలో 76 కోట్ల మంది ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్లను ఉపయోగిస్తారని చైనా ప్రభుత్వ మీడియా చెప్తోంది.
ఈ టెక్నాలజీ అమలులోకి రావటానికి కరోనావైరస్ మహమ్మారి దోహదపడిందని హెనాన్ ప్రావిన్స్‌లోని లూయాంగ్ ఒకేషనల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యాపకుడు వాంగ్ బింగ్ చెప్పారు.
ఇందులో ఉపయోగించే సాఫ్ట్ వేర్, కెమెరాలు చాలా అధునాతనమైనవని.. యూజర్ ఫొటోను దొంగిలించటం వంటి చర్యల ద్వారా వీటిని మాయ చేయటం అసాధ్యమని ఆయన చెప్తున్నారు. ఒకేరకంగా ఉండే కవలల మధ్య తేడాను కూడా ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది.
మరి ఈ టెక్నాలజీ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలవుతుందా? ప్రభుత్వాలు ఆపాలని నిర్ణయించుకుంటే తప్ప ఇది ప్రపంచమంతా అమలులోకి వస్తుందని బ్యాంకింగ్, పేమెంట్ వ్యవస్థల భవిష్యత్తు నిపుణుడు బ్రెట్ కింగ్ భావిస్తున్నారు.
ఆయన.. బ్యాంకింగ్ 4.0 అనే పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. నిజానికి బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ కన్నా మీ ముఖం ఖచ్చితమైన ఆకృతి, కొలతలు మరింత భద్రమైనవని ఆయన చెప్తున్నారు.
‘‘పెరుగుతున్న డిజిటల్ ఐడెంటిటీ నిర్మాణంలో ఫేషియల్ పేమెంట్లు ఒక భాగం... వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలను నేను అర్థం చేసుకుంటాను. కానీ వాస్తవం ఏమిటంటే.. భద్రత కోసం ముఖ ఆధారిత (ఫేస్-బేస్డ్) డిజిటల్ ఐడెంటిటీ నిర్మాణం అనివార్యం’’ అని ఆయన పేర్కొన్నారు.
యాపిల్ ఫోన్ల వినియోగదారులు చాలా మంది తమ హ్యాండ్‌సెట్లను యాక్సెస్ చేయటానికి ఫేషియల్ రికగ్నిషన్‌ను సంతోషంగా ఉపయోగిస్తున్నారని ఆయన ప్రస్తావించారు. ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ దీనికి కొనసాగింపు మాత్రమేనని అభివర్ణించారు.
అయితే.. అసలు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ల విషయంలోనే పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో.. అమెరికా నియంత్రణ సంస్థలు ఈ టెక్నాలజీ మీద దృష్టి సారించవచ్చునని బ్రెట్ కింగ్ చెప్పారు.
ఎఫ్‌బీఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలు అనుమానిత నేరస్తులను గుర్తించటానికి ఈ టెక్నాలజీని ఉపయోగించటాన్ని నిరోధించే బిల్లులను ఈ ఏడాది మళ్లీ ప్రవేశపెట్టాలని అమెరికా కాంగ్రెస్‌లోని కొందరు డెమొక్రాట్ సభ్యులు భావిస్తున్నారు.
చైనాలోనూ యూగర్ ముస్లింలను గుర్తించటానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
పాప్ఐడీ సీఈఓ జాన్ మిల్లర్ మాత్రం.. ప్రధానమైన కార్డు ప్రాసెంసింగ్ కంపెనీలతో తను చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. యాపిల్ పే, గూగుల్ పే వంటి మొబైల్ ఫోన్ యాప్‌లను అధిగమించటానికి ఈ సంస్థలు ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్‌ను ఒక మార్గంగా చూస్తున్నాయి.
అయినప్పటికీ.. ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ ఆలోచనను కొందరు ఎప్పటికీ అంగీకరించబోరని మిల్లర్ ఒప్పుకుంటున్నారు. ‘‘జనంలో ఒక భాగం దీనిని ఎన్నడూ అంగీకరించరు. వారికి ఇదొక సైకలాజికల్ అంశం’’ అని చెప్పారు.
Thursday, 28 January 2021
కేంద్ర బడ్జెట్ ని మొబైల్ లో చూద్దాం. ఈ యాప్ తో............
కరోనా కారణంగా ప్రంపంచంలో చాలా కంపెనీలు ఇప్పటికే టెక్నాలజీతో చాలా యాప్ లు తయారుచేసారు. ఇప్పుడు ఆ పని మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బడ్జెట్ ను యాప్ లో లాంచ్ చేస్తున్నారు .
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు కరోనా కారణంగా ఈసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు
పార్లమెంటులో మొదటిసారి గా పేపర్‌లెస్
బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు.ఈ
పేపర్-లెస్ బడ్జెట్ వేగంగా అందరికి
అందుబాటులో కేంద్ర ఆర్థికమంత్రి ఈ
సారి యూనియన్ బడ్జెట్
మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు. 2021-22 బడ్జెట్
పేపర్ లెస్ బడ్జెట్ అని
అన్నారు అలాగే ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో రూపొందించారు .
ఇది రెండు భాష లో(ఇంగ్లీష్, హిందీ )రెండింట్ లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ OS లో ఇప్పటివరుకు అందుబాటులో వుంది.
ఇప్పటివరకు బడ్జెట్ ను వెబ్ లో అందుబాటులో
ఉంది. దీనిని నేషనల్
ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) రూపొందించింది.
ఇకనుండి మనం ఎక్కడున్నా ఈ
యాప్ ను మన ఆండ్రాయిడ్
లేదా ఐఓఎస్ లో మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అలాగే
మనం క్లియర్ విజన్ లో ఇంకా
ప్రింట్ ను తీసుకోవచ్చు ఆ డౌన్లోడ్ కూడా చాల సులభము గా చూసుకోవచ్చు .
బడ్జెట్‌లో మనకు కావాల్సిన
సమాచారం కోసం సెర్చ్ చేసే వెసులుబాటు కల్పించారు.ఇతర లింక్స్ యాక్సెస్
చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్,ఐఓఎస్ వినియోగదారులు బడ్జెట్ వెబ్ సైట్ నుండి డౌన్
లోడ్ చేసుకోవచ్చు.
ఈ సదుపాయం ను ఫిబ్రవరి 1నుండి ఆర్థికమంత్రి ప్రసంగం పూర్తయ్యాక యాప్‌లో బడ్జెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయి.