Saturday, 6 February 2021

యూట్యూబ్ క్లిప్స్.. ఇందులో ఏముంది.. ఎలా వాడాలి.. లైవ్ నుంచి వీడియో ఎలా కట్ చేసుకోవచ్చు

.

YouTube,clips,cut,  Speed andhara


యూట్యూబ్ క్లిప్స్  ఇప్పుడు బీటా  వెర్షన్  లోనే ఉంది.  కొద్దీ మంది వినియోగదారులు, కొన్ని గేమింగ్ చానల్స్‌కు మాత్రమే ఇది  వాడుతున్నారు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా తగిన మార్పులు చేసి త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు. 

ఈ ఫీచర్ తో  ఇక  మనకు లైవ్ స్ట్రీమ్స్‌ లో ఎక్కడి నుండి వీడియో నచ్చితే  అక్కడి నుండి ఆ  వీడియో  కట్ చేసి 5 సెకన్ల నిడివి నుంచి 60 సెకన్ల వరకు  మాత్రమే కట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు . 

ఈ  సదుపాయము ఆండ్రాయిడ్, వెబ్ వెర్షన్‌లకు వినియోగదారులకు మాత్రమే ఇప్పటివరకు  అందుబాటులో ఉంది ఇక త్వరలో ఐవోఎస్ కస్టమర్స్‌కు తీసుకొచ్చే ప్రయత్నం  చేస్తుంది యూట్యూబ్.

ఎలావాడాలి ,షేర్ చెయ్యాలి అంటే ?

ముందుగా  మన  ఫోన్ లో  లేదా  సిస్టం  లో  యూట్యూబ్‌ ను  ఓపెన్ చెయ్యాలి.   

 అందులో లైవ్ లేదా   వీడియో గని ఓపెన్చెయ్యాలి 

ఆతరువాత ఆ  వీడియో ప్లే చేసి మనకు  నచ్చిన  సమయం లో సీజర్ సింబల్   కనిపిస్తుంది.  

 దాని మీద క్లిక్ చేస్తే.. ‘క్రియేట్ క్లిప్’ కనిపిస్తుంది.  

అప్పుడు మనకు  నచ్చిన  వీడియో పైన చెప్పిన  సమయం ( 5 నుంచి 60 సెకన్ల ) వరకు  కట్ అవుతుంది.  

దాన్ని  వాట్సాప్,టెలిగ్రామ్ ,సిగ్నల్ ఫేస్‌బుక్, ట్విట్టర్ లో షేర్ చేసుకోవచ్చు.

 ఈ  వీడియోలు  షేర్ అవ్వవు....  

 ప్రైవేట్ అని రాసి ఉన్న క్లిప్స్, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌తో పాటు, కిడ్స్ మేడ్ వీడియోలకు మాత్రం ఈ యూట్యూబ్ క్లిప్స్ షేర్ చేయడానికి వీలు లేదు.

యూట్యూబ్ క్లిప్స్   వాడాలి  అంటే  ముందుగా  మీ సిస్టం , ఆండ్రాయిడ్ లో బెటా వెర్షన్  అయి  ఉండాలి . అది తెలుసుకోవాలి అంటే వీడియో క్లిప్ ఐకాన్ కింద కత్తెర సింబల్ కనిపిస్తుంది అప్పుడు మాత్రమే వీడియోస్ షేర్ అవుతుంది .

అప్పుడు  మాత్రమే  మీరు వాడేది   బీటా వెర్షన్ నా కాదా అని తెలుస్తుంది.

No comments:

Post a Comment