Sunday, 16 May 2021

అమెజాన్ నుంచి మినీటీవీ వచ్చేసింది.

అమెజాన్ నుండి ఇప్పుడు 'మినీటీవీ'ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్ సిరీస్, కామెడీ షోలు, టెక్ న్యూస్, ఫుడ్, బ్యూటీ, ఫ్యాషన్ అప్డేట్స్తో పాటు, క్యూరేటెడ్ కంటెంట్ను వినియోగదారులు ఇందులో చూడొచ్చు. ఈ సేవలను అమెజాన్ పూర్తిగా ఉచితంగా అందించడం విశేషం.

అమెజాన్ ఇప్పటికే 'ప్రైమ్' ద్వారా పలు భాషల్లోని సినిమాలతో పాటు, తమ ఒరిజినల్ కంటెట్స్ను వినియోగదారులకు అందిస్తుంది. అయితే ఈ సేవలను మన సబ్ స్క్రిప్షన్ ఆధారంగానే పొందుతాం. కానీ అమెజాన్ తాజాగా తీసుకొచ్చిన 'మినిటీవీ' మాత్రం పూర్తిగా ఉచితం. కానీ ఇందులో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి. 'మినిటీవి'ని అమెజాన్ షాపింగ్ యాప్ లో చూడొచ్చు. టీవీఎఫ్, పాకెట్ ఏసెస్ వంటి ప్రముఖ స్టూడియోలతో పాటు ఆశిష్ చంచలానీ, అమిత్ భదానా, రౌండ్ 2 హెల్, హర్ష్ బెనివాల్, శ్రుతి అర్జున్ ఆనంద్, ఎల్విష్ యాదవ్, ప్రజక్త కోలి, స్వాగర్ శర్మ, ఆకాష్ గుప్తా వంటి ప్రముఖ కమెడియన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్తో అమెజాన్ భాగస్వామ్యం చేసుకుంది. అంతేకాదు టెక్, ఫ్యాషన్, బ్యూటీ వంటి విషయాలకు సంబంధించిన ట్రెండిగ్ న్యూస్, టిప్స్ అందిస్తుంది.

ఈ సర్వీస్లో ఫుడ్ సెక్షన్ కూడా ఉండగా.. కబితా కిచెన్, కుక్ విత్ నిషా, గోబుల్ వంటి ఫేమస్ కుకరీ చానల్స్లోని వీడియోలను ఇందులో అందిస్తున్నారు. రాబోయే వారాల్లో మరెన్నో కొత్త, ప్రత్యేకమైన వీడియోలను జోడిస్తామని అమెజాన్ ప్రకటించింది. ఇక్కడ అమెజాన్ ప్రైమ్, మినీటివి రెండూ రెండు వేర్వేరు ప్లాట్ఫారమ్లు అని గమనించడం ముఖ్యం.

"మినీటివి పూర్తిగా ఉచితం, దీనికి ప్రత్యేక యాప్ అవసరం లేదు. మినీటి ప్రారంభించడంతో, అమెజాన్. ఇన్ షాపింగ్ యాప్ ఇక వినియోగదారులకు మిలియన్ల ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడానికి, మనీ ట్రాన్స్ఫర్ సేవలు వినియోగించడానికి మాత్రమే కాకుండా, ఉచిత వినోద వీడియోలను చూడటానికి ఒకే గమ్యస్థానంగా మారిపోయింది. ప్రస్తుతం, కొత్త వీడియో స్ట్రీమింగ్ సేవ Android వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. IOS మొబైల్ వెబ్ వెర్షన్లు కూడా రాబోయే నెలల్లో విడుదల చేస్తాం' అని కంపెనీ తెలిపింది.




No comments:

Post a Comment