Monday, 11 January 2021

లావా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు.. అన్నీ రూ. 10 వేల లోపే.. అన్నీ మేడ్ ఇన్ ఇండియానే..

lava z1, lava z2, lava z4, lava z6

ఇండియన్ మొబైల్ కంపెనీ లావా ఎంట్రీ లెవల్ విభాగంలో ఒకేసారి నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను  ఆవిష్కరించింది.  

లావా జెడ్ 1, లావా జెడ్ 2, లావా జెడ్ 4, లావా జెడ్ 6 అనే నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఒకే రోజు విడుదల చేసింది. ఈ నాలుగు మోడళ్లూ ఇవాళే విడుదలయ్యాయి.

ఈ కొత్త ఫోన్ల ధర రూ .10,000 కంటే తక్కువే.  

టాప్‌ మొబైల్‌ బ్రాండ్లు షావోమీ, నోకియా, మోటరోలా, శాంసంగ్‌వంటి  ప్రముఖ  కంపెనీలు రిలీజ్‌చేస్తున్న బడ్జెట్  మోడళ్లకు ఇవి గట్టిపోటీ ఇవ్వనున్నాయి.



కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆత్మ నిర్భర్‌ భారత్'‌లో భాగంగా జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను 

భారతీయుల కోసం భారతీయులే  రూపొందించారని కంపెనీ తెలిపింది. లావా జెడ్ సిరీస్‌ఫోన్లు  మీడియా టెక్ ప్రాసెసర్లతో   వస్తున్నాయి.

లావా జెడ్ 2, లావా జెడ్ 4,  లావా జెడ్ 6 ఫోన్లు విక్రయాలు జనవరి 11 నుంచి ప్రారంభంకానుండగా లావా జెడ్ 1 ఫోన్ల సేల్‌ జనవరి 26 నుంచి  మొదలవనుంది.  

ఈ ఫోన్లను అమెజాన్, లావా ఇ-స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా  కొనుగోలు చేయొచ్చు.

* లావా   Z1(2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్) ధర రూ.5,499

* లావా   Z2(2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్) ధర రూ.6,999

* లావా   Z4(4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్) ధర రూ.8,999

* లావా   Z6(6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్) ధర రూ.9,999

మరిన్ని టెక్ స్టోరీస్

సిగ్నల్: వాట్సాప్‌కు తాతలాంటి యాప్... వాడడం ఎలాగో ఫుల్ డీటెయిల్స్ చదవండి 

సీఈఎస్ 2021: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ షో ప్రారంభం 

ఓటీపీ రాకపోయినా భయం లేకుండా ట్రాంజాక్షన్ 

PVC ఆధార్ కార్డు డౌన్లోడ్ ఎలా....

No comments:

Post a Comment