Sunday, 10 January 2021

సీఈఎస్ 2021: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ షో ప్రారంభం

కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షో.. సీఈఎస్ అని పిలిచే ఈ భారీ టెక్నాలజీ ఈవెంట్‌ సందర్భంగా ఏటా ఎంతో సందడి నెలకొంటుంది. కొత్త ఉత్పత్తులు, సరికొత్త సాంకేతికతల ఆవిష్కరణలు.. పెద్దపెద్ద కంపెనీల సీఈవోలు, సెలబ్రిటీలు చెప్పే విషయాలపై అందరి దృష్టీ ఉంటుంది.
కానీ, కరోనావైరస్ కారణంగా ఈ ఏడాది సీఈఎస్-2021 ఆన్‌లైన్‌లోనే జరగనుంది. ఏటా మాదిరిగా లాస్ వెగాస్‌లో నిర్వహించకుండా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
సోమవారం (జనవరి 11) నుంచి ప్రారంభమవుతున్న ఈ ఈవెంట్ జనవరి 14 వరకు కొనసాగనుంది.
ఆన్‌లైన్ ఈవెంట్ అయినప్పటికీ ఈసారి కూడా అనేక కొత్త గాడ్జెట్లు, కొత్తరకం టీవీలు, వాక్యూమ్ క్లీనర్లు, వర్క్ ఫ్రం హోం కోసం ప్రత్యేకమైన గాడ్జెట్లు ఆవిష్కరించనున్నట్లు సంస్థలు ఇప్పటికే చెబుతున్నాయి.

‘‘సీఈఎస్‌కు హాజరుకావడానికి ప్రధాన కారణం ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూడడానికి.. నెట్‌వర్కింగ్ కోసమే. ఈ రెండూ డిజిటల్‌లో అంతగా సాధ్యం కావు’’ అంటున్నారు టెక్నాలజీ ఇండస్ట్రీకి చెందినవారు.
‘‘సీఈఎస్‌కు వెళ్తే అంతవరకు మనకు తెలియకపోయినా మంచి ఉత్పత్తులను తయారుచేసిన కంపెనీలు కొన్ని తారసపడొచ్చు.. ఆన్‌లైన్‌లో కేటలాగ్ చూస్తూ ఇలాంటి సంస్థలను గుర్తించడం కష్టం’’ అంటారు టెక్ ఇండస్ట్రీకి చెందినవారు.
సీఈఎస్ వేదికపై జరిగే కార్యక్రమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. 2020లో ఇవాంకా ట్రంప్‌తో నిర్వహించిన సెషన్ ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచింది.

ఈసారి ఆన్ లైన్ ఈవెంట్ అయినా కూడా కొత్త గాడ్జెట్స్ లాంచింగ్ మాత్రం భారీగానే ఉంటుందని తెలుస్తోంది.

No comments:

Post a Comment