ఈ రోజుల్లో ఫేస్ బుక్ వాడనోళ్లు చాలా తక్కువగా ఉంటారు. సోషల్ మీడియాలో తిరుగులని అధిక్యతతో దూసుకెళుతున్న ఫేస్ బుక్ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకొనివిమర్శల్నిఎదుర్కొంటోంది.
తాజాగా మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఫేస్ బుక్ వాడకందారుల ఫోన్ నెంబర్లు టెలిగ్రామ్ లో అమ్మకానికి పెడుతున్న వైనాన్ని ఒక సెక్యురిటీ సంస్థ చేపట్టిన అధ్యయనంలో గుర్తించింది.
ఫేస్ బుక్ ఐడీలకు చెందిన ఫోన్ నెంబర్లను టెలిగ్రామ్ ఆటోమేటెడ్ బోట్ ను వినియోగించి.. ఒక సైబర్ క్రిమినల్ సంస్థ.. భారీ ఎత్తున వినియోగదారుల నంబర్లను సేకరించి..అమ్మకానికి పెట్టినట్లుగా తేలింది. ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మంది వినియోగదారుల నంబర్లు ఈ రీతిలో బయటపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
2020లో ఈ సైబర్ నేరం గురించి తొలిసారి తెలిసిందని సదరు అధ్యయనం పేర్కొంది. మరింత లోతుల్లోకి వెళితే.. వివిధ దేశాలకు చెందిన 53.3 కోట్ల మంది యూజర్ల సమాచారం చోరీ అయి ఉంటుందని భావిస్తున్నారు. తాము చెప్పిన విషయాన్ని నమ్మరన్న ఉద్దేశంతో.. కొన్ని స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేయటం గమనార్హం. ఇదే అంశాన్ని మదర్ బోర్డు నివేదిక ధ్రువీకరిస్తోంది.
టెలిగ్రామ్ బోట్ ద్వారా వివరాలు చోరీకి గురైనట్లుగా తేలింది. అంతేకాదు.. ఒక్క యూజర్ వివరాలు కావాలంటే 20 డాలర్లు.. టోకుగా కావాలంటే పదివేల మంది వివరాల కోసం 5వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికైనా ఫేస్ బుక్ తన యూజర్లను ఈ విషయం మీద హెచ్చరించాలని కోరుతున్నారు. ఆ పని ఫేస్ బుక్ ఎందుకు చేస్తుంది? తానే.. భద్రతా సమస్యలు ఉన్నాయని హెచ్చరిస్తే.. మొదటికే మోసం రాదూ? ఎందుకైనా మంచిది.. ఫేస్ బుక్ వాడే వారు.. తమ సమాచారాన్ని వీలైనంత తక్కువగా షేర్ చేసుకోవటం మంచిదని చెప్పక తప్పదు.లేదంటే హ్యాకింగ్ బారిన పడటం ఖాయం.
No comments:
Post a Comment