ఫేసుబుక్ గత కొద్ది రోజులుగా ఏదో విదంగా కొత్త ఫీచర్‌లను తెస్తూ వస్తుంది ఇప్పుడు తాజగా అంధులు మరియు దృష్టి తక్కువగా ఉన్న వారి కోసం ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తుంది. అది AI సేవలను తీసుకొస్తుంది. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ . కంప్యూటర్ లేదా రోబోట్ ద్వారా నియంత్రించబడే సామర్ధ్యం, సాధారణంగా మానవులు చేసే పనులను చేయగలరు ఎందుకంటే వారికి మానవ మేధస్సు మరియు వివేచన అవసరం) ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తుంది. ఇంతకు ముందు అంధులు ఫేస్బుక్ వాడితే ఎవరు అయిన ఫోటోలు పెడితే వారికి శబ్ధము చేస్తూ "ఫోటో" అని వినపడేది. (AAT). ఇప్పుడు దాన్ని ఫేస్ బుక్ తాజాగా అప్డేట్ చేసింది.
పైన చెప్పిన AI పద్దతిలో ఇప్పుడుఫేస్‌బుక్‌లో ఫొటో కనిపిస్తే ఆ ఫొటోను వివరిస్తూ ఏఐ శబ్ధం చేస్తూ వినిపించనుంది. అలాగే ఆ ఫొటోలో ఎంతమంది ఉన్నారు ఎవరు ఈ ఫోటోలో ఎక్కడ ఉన్నారు అనేది చెప్తుంది.అలాగే ఎక్కడ తీశారు టైమ్ ను కూడా ఖచ్చితంగా చెప్పుతుంది అని ఫేస్బుక్ అంటుంది.
No comments:
Post a Comment