ఈరోజు రాత్రి ఆకాశం లో శని, గురు గ్రహాలు దగ్గరకు రానున్నాయి. ఈ అద్భుతము ను గూగుల్ ముందుగానే మనకు డూడుల్ రూపంలో చూపించింది . ఇలాంటి విషయంలో గూగుల్ ఎప్పుడు ముందువరసలో నే ఉంటుంది. అత్యంత ఎక్కువ సేపు ఉండే రాత్రి కూడా ఈరోజే రానుంది. దాదాపు 400 సంవత్సరాల తర్వాత ఇటువంటి అద్భుత దృశ్యం మన కళ్ల ముందు కనిపిస్తుంది . ఈ రెండు గ్రహములు ఒకే నక్షత్రం గా మనకు కనిపిస్తుంది . దీన్ని ఖగోళ శాస్త్రవేత్త లు మహా సంయోగం అని పిలుస్తున్నారు . సూర్యాస్తమయం జరిగిన గంట తర్వాత గురు గ్రహం ధగధగా మెరిసే నక్షత్రం తరహాలో ఆకాశంలో కనిపిస్తుంది. శని గ్రహం గురుగ్రహం కంటే కాస్త తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మన కంటికి ఇవి రెండూ దగ్గరగా కనిపించినా, ఒకదాన్ని ఒకటి దాటే సమయంలో వీటి మధ్య దాదాపు 45 కోట్ల మైళ్ల తేడా ఉండనుంది.
ఈ రోజు సాయంత్రం 5:21 నుండి రాత్రి 7:12 నిమషాలు వరకు ఈఅద్భుతదృశ్యం మనకు కనిపిస్తుంది . దీన్ని మనకు బాగా కనపడాలి అంటే బైనాక్యూలర్స్ తో చూడాలి .
No comments:
Post a Comment