కరోనా కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడి ఎడ్యుకేషన్ ఆన్‌లైన్‌లోకి మారడంతో పిల్లలందరికీ ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. దానికోసం చాలామందికి కొత్తగా స్మార్టు ఫోన్లు అవసరం అవుతున్నాయి. కానీ.. ఈ అవసరాన్ని , డిమాండునుదృష్టిలో పెట్టుకునే కంపెనీలు కూడా ధరలు పెంచాయి. గతం కంటే స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగాయి ఇప్పుడ దీంతో బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు ఎక్కువగా సెర్చ్ చేయాల్సి వస్తోంది. అయితే.. పండుగల సీజన్ మొదలు కావడంతో ఇప్పుడు మళ్లీ కంపెనీలు కాస్త ధరలు తగ్గించడమో, ఆఫర్లు ఇవ్వడమో చేస్తున్నాయి. అలా రూ. 15 వేల లోపు ధరకు ఫ్లిప్ కార్డులో ఏఏ మొబైల్స్ దొరుకుతున్నాయో ఒకసారి చూద్దాం.
ఈఏడాది నవంబర్లో విడుదలైన మోటో జీ9 స్మార్ట్‌ఫోన్ కొంతమేర సక్సెస్ అయింది. 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ తో రూ.11,999 ధరకు ఫ్లిప్ కార్ట్లో అందుబాటులో ఉంది. దీని ఫిచర్స్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ నానో సిమ్ సపోర్ట్ ఫీచర్లతో లభిస్తుంది. మరో ఫోన్ మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్. పూర్తి ఇండియా స్మార్ట్ ఫోన్ ఇది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఫీచర్లతో రెండు కలర్స్‌లో లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ 4జిబి ర్యామ్ +64జిబి ఇంటర్నల్ స్టోరేజ్. దీని ధర రూ.10,999కు ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసుకోవచ్చు.
ఈఏడాది భారీగా అమ్ముడుపోయిన మరో స్మార్ట్ ఫోన్ రియల్‌మి 7ఐ. రెండు కలర్లతో, 5000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ, 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్లతో లభిస్తున్న ధర రూ.11,999 కాగా, రియల్ మీ 6ఐ 4300 ఎంఏహెచ్ తో 6GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.13,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్‌లో లభించే రియల్ మీ 5ఐ 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 లకు కొనుక్కోవచ్చు. రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ నార్జో 20 ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీ+ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేతో పాటుగా మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 48+8+2 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 వద్ద ఇవేకాక పోకో, ఇంఫినిక్స్, ఒప్పో కంపెనీ ఫోన్లు కూడా రూ.15వేల లోపు కొనుక్కోవచ్చు.
No comments:
Post a Comment