Sunday, 20 December 2020

బెస్ట్ గేమింగ్ మొబైల్స్: ఏది బెస్ట్? ధర ఎంత?

asus rog phone, gaming mobiles


గేమింగ్ కోసమే ప్రత్యేకంగా మొబైల్స్ ఉన్న సంగతి మీకు తెలుసా? వీటిలో బెస్ట్ గేమింగ్ మొబైల్ ఏదో తెలుసా? ఇప్పటికే మన ఇంట్లోని టీవీ, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను మించిపోయిన స్మార్ట్‌ఫోన్‌.. గేమింగ్‌ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది.

కొన్ని టాప్‌ మొబైల్‌ కంపెనీలు ప్రత్యేకంగా గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు ఆయా కంపెనీల ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ను కూడా మించిన ధరలతో అదరగొట్టిన ఈ గేమింగ్‌ మొబైల్స్ .. ఇప్పుడిప్పుడే అందుబాటు ధరల్లోకి వస్తున్నాయి.

అసలు ఈ గేమింగ్‌ మొబైల్ ఏంటి? వీటిలో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి? బెస్ట్ గేమింగ్ మొబైల్ ఏది? అలాగే వీటిలో ఆడేందుకు బెస్ట్‌ గేమ్స్‌ ఏమున్నాయో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.

ఏంటీ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌?

ఓ స్మార్ట్‌ఫోన్‌ కొనే ముందు మనకు కావాల్సిన ఫీచర్‌ ఉందా లేదా చూస్తాం. కొందరికి కెమెరా బాగుండాలి. మరికొందరికి స్క్రీన్‌ పెద్దగా ఉండాలి. ఇంకొందరికి ర్యామ్‌ ఎక్కువగా కావాలి. అలాగే గేమ్స్‌ అంటే ఇష్టమైన వాళ్లకు గేమింగ్‌ ఫీచర్స్‌ ఉండాలి.

ఇలా ప్రత్యేకంగా గేమింగ్‌ ఫీచర్స్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్లే ఈ గేమింగ్‌ ఫోన్స్‌. మంచి పర్ఫార్మెన్స్‌, డిస్‌ప్లే, ఇతర అత్యాధునిక స్పెసిఫికేషన్లన్నీ ఈ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉంటాయి. ముఖ్యంగా పబ్‌జీ, పోకెమాన్‌లాంటి గేమ్స్‌ వచ్చిన తర్వాత ఈ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్‌ పెరిగింది.

టాప్‌ కంపెనీలు కూడా ప్రత్యేకంగా గేమింగ్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. షియోమీ, నూబియా, ఆసుస్‌, వన్‌ ప్లస్‌, సామ్‌సంగ్‌లాంటి కంపెనీలు గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ రిలీజ్‌ చేయడం లేదా తమ ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌లోనే ఈ గేమింగ్‌ ఫీచర్స్‌ యాడ్‌ చేయడమో చేస్తున్నాయి.

ఏ ఫీచర్స్‌ ఉంటాయి?

బెస్ట్ గేమింగ్ మొబైల్ అంటే ఏ ఫీచర్లు ఉండాలి? డిస్‌ ప్లే పెద్దగా ఉండాలి. మంచి పర్ఫార్మెన్స్‌ ఉండాలి. వీటితోపాటు ఇంకా చాలా ఫీచర్సే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలను బాగా గుర్తుంచుకోండి.

– ఫోన్‌ సీపీయూ విషయానికి వస్తే.. సీపీయూ కోర్‌ కౌంట్‌, క్లాక్‌ స్పీడ్‌ చూడాలి. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.

– ఇక జీపీయూ అంటే గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌. గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఇది చాలా ఇంపార్టెంట్‌. ఒకవేళ మీరు క్వాల్‌కామ్‌ ఎస్‌ఓసీ (సిస్టమ్‌ ఆన్‌ చిప్‌) ఉన్న ఫోన్‌ కొంటుంటే.. అందులో 800 సిరీస్‌ బెస్ట్‌.

– ప్రస్తుతం మార్కెట్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ఎస్‌ఓసీ అందుబాటులో ఉంది. ఇందులోని జీపీయూ పర్ఫార్మెన్స్‌ చాలా బాగుంటుంది. ఈ చిప్‌సెట్‌ షియోమీ బ్లాక్‌ షార్క్‌ 2, నూబియా రెడ్‌ మ్యాజిక్‌ 3 స్మార్‌ఫోన్‌లలో ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 855 సీపీయూ, ఆడ్రెనో 640 జీపీయూతో గేమింగ్‌కు ఈ ఫోన్లు బెస్ట్‌ మోడల్స్‌గా చెప్పొచ్చు.

– ఇక RAM విషయానికి వస్తే గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు ఎంత ఎక్కువ ర్యామ్‌ ఉంటే అంత బెటర్‌. ప్రస్తుతం 12 జీబీ ర్యామ్‌ ఉన్న ఫోన్లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి.

– గేమింగ్‌ మోడ్‌ ఉందో లేదో చూడండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ మోడ్‌ ఆన్‌ చేసినప్పుడు ఫోన్‌లోని సీపీయూ క్లాక్‌ హై రేంజ్‌కు చేరుతుంది. దీనివల్ల మంచి గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ మీ సొంతమవుతుంది.

- డిస్‌ ప్లే సాధ్యమైనంత ఎక్కువగా ఉంటే మంచిది. సాధారణంగా గేమింగ్స్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో ఇవి ఆరున్నర ఇంచుల వరకూ ఉంటాయి. డిస్‌ప్లేలో మంచి రెజల్యూషన్‌తోపాటు రీఫ్రెష్‌ రేట్‌ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. గ్రాఫిక్స్‌ సాఫీగా సాగిపోవడానికి ఫోన్‌ డిస్‌ప్లే ఎంత వేగంగా అప్‌డేట్‌ అవుతుందన్నది ఈ రీఫ్రెష్‌ రేట్స్‌ నిర్ధారిస్తాయి. సాధారణంగా రీఫ్రెష్‌ రేట్స్‌ 90 Hz, 120 Hz వరకూ ఉంటాయి.

– స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా వాడితే వేడెక్కుతాయి. అలాంటిది గంటల తరబడి గేమ్స్‌ ఆడితే వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రత్యేకమైన కూలింగ్‌ వ్యవస్థతో వస్తాయి. ఈ వ్యవస్థ వల్ల ఫోన్‌ మరీ వేడెక్కకుండా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో బిల్టిన్‌ ఫ్యాన్‌, లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌తో వస్తున్న ఫోన్లు ఉన్నాయి. వాటిని కొంటే మంచిది.

ఫుల్‌ డిమాండ్‌

మార్కెట్‌లో స్పెషల్‌గా గేమ్స్‌ కోసమే స్మార్ట్‌ఫోన్లు రిలీజ్‌ అవుతున్నపుడు సాధారణ ఫోన్స్‌ను గేమింగ్‌ లవర్స్‌ ఎందుకు ఇష్టపడతారు. అందులోనూ చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా కొత్త కొత్త గేమ్స్‌ అందరినీ అలరిస్తున్నాయి.

ముఖ్యంగా పబ్‌జీ మొబైల్‌లాంటి గేమ్స్‌ వచ్చిన తర్వాత ఈ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్‌ చాలా పెరిగిపోయింది. సాధారణ ఫోన్ల కంటే ఈ గేమింగ్‌ ఫోన్స్‌లో గేమ్స్‌ ఆడితే వచ్చే మజానే వేరు.

వీటిలోని గ్రాఫిక్స్‌ క్వాలిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. పైగా ఈ ఫోన్లలోని ఫీచర్లతో ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీలాంటివి కూడా వాడుకోవచ్చు. దీంతో గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్‌ రాకెట్‌ వేగంతో దూసుకెళ్తోంది. 2015లో తొలిసారి ఈ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి.

అప్పట్లో టాప్‌ కంపెనీలు వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతుండటంతో సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌, ఆపిల్‌లాంటి కంపెనీలు కూడా గేమింగ్‌ ఫోన్స్‌పై దృష్టి సారిస్తున్నాయి.

అటు స్మార్ట్‌ఫోన్‌లకు చిప్‌సెట్‌ అందించే సంస్థలు కూడా గేమింగ్‌ కోసం స్పెషల్‌గా చిప్స్‌ను తయారు చేస్తున్నాయి. క్వాల్‌కామ్‌ విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్‌ 730జీ అలాంటిదే. ఇందులో జీ అంటే గేమింగ్ అని అర్థం. ప్రాసెసర్‌ ఫాస్ట్‌గా ఉండటం ఒక్కటే కాదు.. మొత్తంగా ఓ కొత్త గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ యూజర్లకు అందాలన్న లక్ష్యంతో క్వాల్‌కామ్‌ పని చేస్తోంది.

గేమ్స్‌లో తరచూ అడ్డుపడే ఎర్రర్స్‌ని జాంక్స్‌ అంటారు. ఇప్పుడు వాటిని సాధ్యమైనంతగా తగ్గించే పనిలో ఆ సంస్థ ఉంది. ఆ దిశగా చిప్‌సెట్స్‌ను తయారు చేస్తోంది. ఇప్పటికే క్వాల్‌కామ్‌కు పోటీగా ఈ చిప్‌సెట్‌ రంగంలో మీడియా టెక్‌, అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైసెస్‌ (ఏఎండీ) చేరాయి.

ధరలూ తగ్గుతున్నాయి

ఇతర ఫోన్లతో పోలిస్తే గేమింగ్ మొబైల్ లో అత్యాధునిక ఫీచర్స్‌ ఉంటాయి. దీంతో వీటి తయారీ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే మొదట్లో ఈ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేసే కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల కంటే కూడా ఎక్కువ ధరలు నిర్ణయించేవారు.

కానీ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌లోనూ పోటీ పెరిగిపోతుండటంతో క్రమంగా వీటి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఉదాహరణకు ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ (ASUS ROG)నే తీసుకోండి. దీని ధరను ఆ సంస్థ రూ. 69,999గా నిర్ణయించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరిన్ని ఫీచర్లతో రోగ్‌ ఫోన్‌ II వచ్చింది. అయితే దీని ధరను రూ. 37,999కి తగ్గించేశారు. అది కూడా కేవలం ఏడాది వ్యవధిలోనే కావడం విశేషం. అలాగా షియోమీ, నూబియా సంస్థలు కూడా గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గిస్తున్నాయి.

బెస్ట్‌ గేమింగ్‌ మొబైల్ ఏవి?

మంచి డిస్‌ప్లే, ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ, జీపీయూ స్పీడ్స్‌, ర్యామ్‌, ప్రాసెసర్‌ను బట్టి మార్కెట్‌లో ఇప్పుడున్న బెస్ట్‌ గేమింగ్‌ మొబైల్ అంచనా వేయొచ్చు. ఇప్పటికీ ధరలు కాస్త ఎక్కువగానే అనిపించినా.. మంచి గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలంటే ఆ మాత్రం పెట్టాల్సిందే. మరి మార్కెట్‌లోని బెస్ట్ గేమింగ్ మొబైల్ ఏదో ఇప్పుడు చూద్దాం.

ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ 2 (ASUS ROG Phone 2)

ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ కు కొనసాగింపుగా వచ్చిన మోడల్‌ ఇది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే రిలీజైంది. 6.59 ఇంచుల డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో గేమింగ్‌కు బెస్ట్‌ ఫోన్‌గా గుర్తింపు పొందింది.

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 సీపీయూతో 8జీబీ, 12 జీబీ ర్యామ్‌.. 128 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. డ్యుయల్‌ రియర్‌ కెమెరా (48 ఎంపీ + 13 ఎంపీ). స్టీరియో స్పీకర్స్‌ ఉన్నాయి. రీఫ్రెష్‌ రేట్‌ 120Hz. దీని ధర ఇండియాలో రూ. 37,999. అత్యాధునిక గేమింగ్‌ ఫీచర్స్‌తో ఇంత తక్కువ ధరకు వస్తున్న ఏకైక ఫోన్‌ ఇదే.

షియోమీ బ్లాక్‌ షార్క్ 2

ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ 2తో పోలిస్తే బ్యాటరీ కాస్త తక్కువ. ధర కాస్త ఎక్కువ. ఈ మధ్యే ఈ బ్లాక్‌ షార్క్‌ 2 మార్కెట్‌లోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 855 సీపీయూ, 6, 12 జీబీ ర్యామ్, 128, 256 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం, డ్యుయల్‌ రియర్‌ కెమెరా (48+12), 6.39 ఇంచుల డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, రీఫ్రెష్‌ రేట్‌ 60 Hz గా ఉన్నాయి. దీని ధర ఇండియాలో రూ. 39,999. గ్లాస్‌, మెటల్‌తో కూడిన డిజైన్‌, మెరుగైన కూలింగ్‌ వ్యవస్థ ఈ ఫోన్‌ ప్రత్యేకతలు.

వన్‌ ప్లస్‌ 7 ప్రో

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్లకు చెమటలు పట్టిస్తున్న వన్‌ ప్లస్‌ సంస్థ ప్రత్యేకంగా గేమింగ్‌ కోసం తీసుకొచ్చిన మొబైల్‌ ఇది. 6.67 ఇంచుల డిస్‌ ప్లే ఇందులో ఉంటుంది. 6, 8, 12 జీబీ ర్యామ్‌ వేరియేషన్లు, 128, 256 జీబీ స్టోరేజ్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యుయల్‌ రియర్‌ కెమెరా (48+16), స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌ గేమింగ్ స్మార్టఫోన్‌ కాంపిటిటర్లకు గట్టి పోటీ ఇస్తోంది. దీని లుక్‌ కూడా అద్భుతంగా ఉంది. ధర రూ. 44,999.

ఆపిల్‌ ఐఫోన్‌ XR

ఐఫోన్‌ కమ్‌ గేమింగ్‌ లవర్స్‌కు బెస్ట్‌ ఆప్షన్‌ ఇది. ఐఫోన్‌ నుంచి వచ్చిన తొలి డ్యుయల్‌ సిమ్‌ మోడల్‌ అయిన ఈ XR ధర ఈ మధ్య భారీగా తగ్గింది. అమెజాన్‌లో సేల్‌ సమయంలో 64 జీబీ వేరియంట్‌ ధర రూ. 44,900కే ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది.

ఐఫోన్‌ 11 సిరీస్‌ వచ్చిన తర్వాత ఈ ఫోన్‌ ధరను ఆపిల్‌ సంస్థే తగ్గించింది. సేల్‌ కాకుండా మిగతా సమయాల్లో దీని ధర రూ. 49,900గా ఉంది. 6.1 ఇంచుల డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్‌, 64, 128, 256 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం, 2942 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 12 ఎంపీ రియర్‌ కెమెరా, ఆపిల్‌ ఏ12 బయోనిక్‌ ప్రాసెసర్‌ ఇందులో ఉంటాయి.

నూబియా రెడ్‌ మ్యాజిక్‌ 3

6.65 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 6, 8 జీబీ ర్యామ్‌, 64, 128 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 90 Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తున్న నూబియా రెడ్‌ మ్యాజిక్‌ 3 కూడా గేమింగ్‌ లవర్స్‌కు మంచి ఆప్షన్‌.

ఈ ఫోన్‌కు అదనంగా షౌల్డర్‌ బటన్స్‌ కూడా వస్తాయి. ఫాస్ట్‌ చార్జింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. దీని ధర రూ. 33,999గా ఉంది. త్వరలోనే స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ప్రాసెసర్‌తో రెడ్ మ్యాజిక్‌ 3ఎస్‌ కూడా మార్కెట్‌లోకి రానుంది.

ఇవే కాకుండా.. సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 9, సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 10 ప్లస్ , హానర్‌ ప్లే, రేజర్‌ ఫోన్‌ 2 గేమింగ్‌ ఫోన్లు కూడా ట్రై చేయొచ్చు.

ఎక్కువగా ఆడుతున్నవేవి?

గేమింగ్‌ ఫోన్‌ గురించి తెలుసుకున్నారు. మరి ప్రస్తుతం ఏ గేమ్స్‌ టాప్‌లో ఉన్నాయో తెలుసా? గూగుల్‌ ప్లే, యాప్‌ స్టోర్‌లలో లక్షల గేమ్స్‌ ఉన్నాయి. అయితే అందులో మీ టేస్ట్‌ను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. రేసింగ్‌, షూటింగ్‌, పజిల్స్‌, రోల్‌ ప్లేయింగ్‌.. ఇలా ఒక్కో కేటగిరీలోనూ ఎన్నో గేమ్స్‌ ఉంటాయి.

వీటిలో ప్రస్తుతం ఆదరణ పొందిన గేమ్స్ లో పబ్‌జీ మొబైల్‌ (PUBG Mobile), ఫోర్ట్‌నైట్‌ (Fortnite), ఇన్‌ టు ద డెడ్‌ 2 (In to the dead 2), కాల్‌ ఆఫ్‌ డ్యూటీ మొబైల్‌ (call of duty:mobile), రియల్‌ రేసింగ్‌ 3 (real racing 3), సెకండ్‌ గెలాక్సీ (second galaxy) లాంటి గేమ్స్‌ ఉన్నాయి.


No comments:

Post a Comment