Thursday, 28 January 2021
ఫేస్ బుక్ లో మీకు నచ్చింది పెట్టేస్తున్నారా?.. ఐతే ఇది చూడండి
తాజాగా మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఫేస్ బుక్ వాడకందారుల ఫోన్ నెంబర్లు టెలిగ్రామ్ లో అమ్మకానికి పెడుతున్న వైనాన్ని ఒక సెక్యురిటీ సంస్థ చేపట్టిన అధ్యయనంలో గుర్తించింది.
ఫేస్ బుక్ ఐడీలకు చెందిన ఫోన్ నెంబర్లను టెలిగ్రామ్ ఆటోమేటెడ్ బోట్ ను వినియోగించి.. ఒక సైబర్ క్రిమినల్ సంస్థ.. భారీ ఎత్తున వినియోగదారుల నంబర్లను సేకరించి..అమ్మకానికి పెట్టినట్లుగా తేలింది. ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మంది వినియోగదారుల నంబర్లు ఈ రీతిలో బయటపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
2020లో ఈ సైబర్ నేరం గురించి తొలిసారి తెలిసిందని సదరు అధ్యయనం పేర్కొంది. మరింత లోతుల్లోకి వెళితే.. వివిధ దేశాలకు చెందిన 53.3 కోట్ల మంది యూజర్ల సమాచారం చోరీ అయి ఉంటుందని భావిస్తున్నారు. తాము చెప్పిన విషయాన్ని నమ్మరన్న ఉద్దేశంతో.. కొన్ని స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేయటం గమనార్హం. ఇదే అంశాన్ని మదర్ బోర్డు నివేదిక ధ్రువీకరిస్తోంది.
టెలిగ్రామ్ బోట్ ద్వారా వివరాలు చోరీకి గురైనట్లుగా తేలింది. అంతేకాదు.. ఒక్క యూజర్ వివరాలు కావాలంటే 20 డాలర్లు.. టోకుగా కావాలంటే పదివేల మంది వివరాల కోసం 5వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికైనా ఫేస్ బుక్ తన యూజర్లను ఈ విషయం మీద హెచ్చరించాలని కోరుతున్నారు. ఆ పని ఫేస్ బుక్ ఎందుకు చేస్తుంది? తానే.. భద్రతా సమస్యలు ఉన్నాయని హెచ్చరిస్తే.. మొదటికే మోసం రాదూ? ఎందుకైనా మంచిది.. ఫేస్ బుక్ వాడే వారు.. తమ సమాచారాన్ని వీలైనంత తక్కువగా షేర్ చేసుకోవటం మంచిదని చెప్పక తప్పదు.లేదంటే హ్యాకింగ్ బారిన పడటం ఖాయం.
Tuesday, 26 January 2021
ఫేసుబుక్ లో ఫోటో పెడితే చాలుఅందులో ఎవరు ఉన్నారో చెబుతోంది.
పైన చెప్పిన AI పద్దతిలో ఇప్పుడుఫేస్‌బుక్‌లో ఫొటో కనిపిస్తే ఆ ఫొటోను వివరిస్తూ ఏఐ శబ్ధం చేస్తూ వినిపించనుంది. అలాగే ఆ ఫొటోలో ఎంతమంది ఉన్నారు ఎవరు ఈ ఫోటోలో ఎక్కడ ఉన్నారు అనేది చెప్తుంది.అలాగే ఎక్కడ తీశారు టైమ్ ను కూడా ఖచ్చితంగా చెప్పుతుంది అని ఫేస్బుక్ అంటుంది.
Thursday, 21 January 2021
శామ్సంగ్ గెలాక్సీ M62 వచ్చేస్తుంది 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో
సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లో కి లాంచ్ చెయ్యడానిసిద్ధం అయింది ఇప్పటికే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ లో M సిరీస్ లో చాల మోడల్స్ క్లిక్ ఐయ్యాయి ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎం62 పేరుతో మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది .ఇది ఇప్పటికే లాంచ్ అయిన గెలాక్సీ ఎం51 ఫోన్‌కు తర్వాత వెర్షన్‌గావస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ M62 " F62 "ను పోలి ఉంటుంది
శాంసంగ్ గెలాక్సీ ఎం62 7,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ,స్పీడ్‌గా ఛార్జ్ అయ్యేలా 25 వాట్స్‌తో చార్జర్ కూడా ఇవ్వనున్నారు.
ఇది గెలాక్సీ నోట్ 10 మరియు నోట్ 10 + లలో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 చిప్‌సెట్ కలిగి ఉంది
గెలాక్సీ ఎం62 ఫోన్ ఫీచర్లు ఇప్పుడు దిగువన చూద్దాం
సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
రిసొల్యూషన్: 1080 x 2400, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ
ఫ్రంట్ కెమెరా: 64 MP +1.8+12+2.2+5+2.4
రేర్ కెమెరా: 64 MP + 12 MP + 5 MP + 5 MP
ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్
4జీ ఎల్‌టీఈ
డ్యూయల్ బ్యాండ్ వై-ఫై
ఎన్ఎఫ్‌సీ సపోర్ట్
6 జీవీ ర్యామ్, 256 జీవీ ఇంటర్నల్ స్టోరేజీ
ఆండ్రాయిడ్ 11
ఎక్స్‌నోస్ 9825 ప్రాసెసర్
బ్లూటూత్ v5.0, A2DP, LE
బ్యాటరీ :లి-అయాన్ 7000 mAh నాన్ రిమూవల్
163.9 mm x 76.3 mm x 9.5 mm మరియు బరువు కలిగి ఉంటుంది.
ఇది ఈ సెగ్మెంట్లో మార్కెట్లో ఇతర మొబైల్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలదు అని కంపెనీ భావిస్తుంది.
ఫేస్‌బుక్ పేజీలను ఇక లైక్ చేయలేరు.. ఓన్లీ ఫాలోయింగ్
ఫేస్‌బుక్ యూజర్లకి సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యింది ఇప్పటివరకు మనం పేస్ బుక్ లో ఏ వీడియో, ఇమేజ్ అయినా చూసినపుడు అది మనకు నచ్చితే వెంటనే మనం లైక్ ను కొట్టే వాళ్ళం ఆ స్థానంలో ఇప్పుడు పేస్ బుక్ మార్పులు చేసి దాని స్తానం లో ఇప్పుడు ఫాలో అనే బటన్ ఇప్పుడు తెస్తుంది. ఇప్పటి వరకు వాళ్లకు రెండు ఆప్షన్ లు ఉండేవి అవి లైక్, ఫాలో ఐతే వాళ్లకు ఏది సమస్య గా గుర్థించి ఫేస్‌బుక్ లైక్ బటన్ తొలగించనున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది ఇక మనం ఇకనుంచి పేజీ ఫాలోవర్స్ ఆధారంగానే ఆ పేజీ ఎంత పాపులర్ అనేది నిర్దారించనున్నారు.ఐతే లైక్ బటన్'ను ఇంత వరకు పబ్లిక్ ఫిగర్స్, ఆర్టిస్టులు, వివిధ బ్రాండ్లు కు ఉపయోగిo చేవారు ఇక నుండి ఫాలో బటన్ ను వాడాలి. .
Wednesday, 20 January 2021
వైరు లేకుండా టీవీ.. ఈ టెక్నాలజీ వచ్చేస్తోంది
టీవీ అంటే కరెంటు కనెక్షన్.. ప్లగ్, వైర్ అన్నీ ఉండాలి. కానీ, ఇక నుంచి అలాంటి అవసరం లేకుండా వైరన్నది లేకుండా పనిచేసే టీవీలు వస్తున్నాయి. అలాంటి టెక్నాలజీ అభివృద్ధి చేసింది రష్యాకు చెందిన రెజొనెన్స్ అనే స్టార్టప్ కంపెనీ. దీన్ని ఆ కంపెనీ వైర్‌లెస్ టెక్నాలజీ అంటోంది. ఈ టెక్నాలజీలో కరెంటు ప్లగ్ బదులుగా వైఫై పద్ధతిలో టీవీకి విద్యుత్ సరఫరా వస్తుంది.
వైఫై పద్ధతిలో విద్యుత్‌ను సరఫరా చేసే వ్యవస్థ, దాన్ని స్వీకరించే రిసెప్షన్ సిస్టమ్ వంటి అధునాతన టెక్నాలజీ ఈ టీవీలలో ఏర్పాటు చేశారు. ఈ నూతన టెక్నాలజీని రీసెంటుగా జరిగిన సీఈఎస్-2021లో ప్రదర్శించారు.
ఐతే ఈ టెక్నాలజీ ఐడియా కొత్తదేమీ కాదు. ఇలాంటిది డెవలప్ చేస్తామని సీఈఎస్-2020లో కొరియా కంపెనీ శాంసంగ్ చెప్పింది. కానీ, తన ప్రణాళికలను ఆ తరువాత శాంసంగ్ రద్దు చేసుకుంది.
రష్యాకు చెందిన రెజొనెన్స్ అనే స్టార్టప్ కంపెనీ వైర్‌లెస్ పద్ధతిలో విద్యుత్‌ను స్వీకరించే రిసీవర్ కాయిల్‌ను టీవీ లోపలే ఏర్పాటు చేశామని, ప్రసారం చేసే ట్రాన్స్‌మీటర్‌ను టీవీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని తెలిపింది.
అలాగే కనీసం ఒక మీటర్ దూరం వరకు విద్యుత్తును ప్రసారం చేయవచ్చని, కాయిల్ సైజును మార్చడం ద్వారా ఈ దూరాన్ని మరింత పెంచవచ్చని తెలిపింది.
రిసీవర్ కాయిల్‌ను టెలివిజన్ ఫ్రేమ్‌లో చేర్చవచ్చని, ట్రాన్స్‌మీటర్‌ను అవసరాన్ని బట్టి టెలివిజన్ అడుగునగానీ, గోడ లోపలగాని ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
అయితే పేటెంట్ల హక్కులు కోసం కెనడా, యూరోపియన్ యూనియన్, అమెరికా , దక్షిణ కొరియా ఇంకా ఇండియా లో కూడా దరఖాస్తు చేసుకుంది.
వైర్‌లెస్ టీవీ 80-90% ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని మరియు 120W వరకు ఉపయోగించే టీవీలతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు , వంటి పెద్ద పరికరాల్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించవచ్చు.
Monday, 18 January 2021
సిగ్నల్ యాప్ లో గ్రూప్ చాట్ పై ఒక లుక్ ఎద్దామా
గత కొద్దిరోజులుగా వాట్సాప్ గురుంచి ప్రజల్లో చాల చర్చ జరుగుతుంది . అది వాట్సాప్ వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తోపంచుకుంటుంది అని అలాగే తమ డేటానుకూడా , తాజా ప్రైవసీ పాలసీని వినియోగదారులంతా అంగీకరించాల్సిందేనని జనవరి 4న వాట్సాప్ ఓ ప్రకటన ఇచ్చింది. అలాగే ఫిబ్రవరి 8లోగా కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లు యాక్సెప్ట్ చేయాలని, లేకపోతే తర్వాత వారు వాట్సాప్ వాడుకోవడం కుదరదని తేల్చేసింది.
ఐనా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఈ మధ్యనే వాయిదా వేసింది.. అప్పటికే జరగలిసిన నష్టం చాలానే జరిగింది.
సిగ్నల్ అనే మెసేజింగ్ యాప్‌క ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఐతే ఇప్పుడు అది వాడటం ఎలానో చూద్దాం వ్యక్తిగత కాంటాక్ట్‌లయితే సిగ్నల్ యాప్
ద్వారా షేర్ చేసుకోవచ్చు. గ్రూప్ చాటింగ్ ఎలాగనుకుంటున్నారా. చాల సులభముగా చెయ్యవచ్చు
అది ఎలానో ఇప్పుడు ఒక లుక్ వేద్దామా స్టెప్
బై స్టెప్.......
1) మీ స్మార్ట్‌ఫోన్‌లో సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2)
మీ ఫోన్ నంబర్, ఫోటో పెట్టుకుని
అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోండి.
3) ఇప్పుడు మీ కాంటాక్ట్‌లను యాడ్ చేసుకోండి.
4) తర్వాత సిగ్నల్ యాప్‌ను
ఓపెన్ చేసి మెనూలోకి వెళ్లండి.
5) సెట్టింగ్స్ సెలెక్ట్ చేసి గ్రూప్ లింక్‌ను క్లిక్ చేయండి.
6) గ్రూప్ లింక్‌ను టాగుల్ చేసి షేర్ ఆప్షన్‌ణు క్లిక్
చేయండి.
7) ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేసి ఆ
గ్రూప్ లింక్‌ను కాపీ చేయండి.
8) దీన్ని ఇప్పుడు మీ సిగ్నల్ యాప్ చాట్‌లో పేస్ట్ చేయండి.
9) ఇక మీ వాట్సాప్ గ్రూప్ చాట్‌ను ఇక మీ సిగ్నల్ యాప్‌లో
వాడుకోవచ్చు.
Monday, 11 January 2021
లావా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు.. అన్నీ రూ. 10 వేల లోపే.. అన్నీ మేడ్ ఇన్ ఇండియానే..
ఇండియన్ మొబైల్ కంపెనీ లావా ఎంట్రీ లెవల్ విభాగంలో ఒకేసారి నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది.
లావా జెడ్ 1, లావా జెడ్ 2, లావా జెడ్ 4, లావా జెడ్ 6 అనే నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఒకే రోజు విడుదల చేసింది. ఈ నాలుగు మోడళ్లూ ఇవాళే విడుదలయ్యాయి.
ఈ కొత్త ఫోన్ల ధర రూ .10,000 కంటే తక్కువే.
టాప్ మొబైల్ బ్రాండ్లు షావోమీ, నోకియా, మోటరోలా, శాంసంగ్‌వంటి ప్రముఖ కంపెనీలు రిలీజ్‌చేస్తున్న బడ్జెట్ మోడళ్లకు ఇవి గట్టిపోటీ ఇవ్వనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆత్మ నిర్భర్ భారత్'లో భాగంగా జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను
భారతీయుల కోసం భారతీయులే రూపొందించారని కంపెనీ తెలిపింది. లావా జెడ్ సిరీస్‌ఫోన్లు మీడియా టెక్ ప్రాసెసర్లతో వస్తున్నాయి.
లావా జెడ్ 2, లావా జెడ్ 4, లావా జెడ్ 6 ఫోన్లు విక్రయాలు జనవరి 11 నుంచి ప్రారంభంకానుండగా లావా జెడ్ 1 ఫోన్ల సేల్ జనవరి 26 నుంచి మొదలవనుంది.
ఈ ఫోన్లను అమెజాన్, లావా ఇ-స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
* లావా Z1(2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్) ధర రూ.5,499
* లావా Z2(2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్) ధర రూ.6,999
* లావా Z4(4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్) ధర రూ.8,999
* లావా Z6(6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్) ధర రూ.9,999
మరిన్ని టెక్ స్టోరీస్
సిగ్నల్: వాట్సాప్‌కు తాతలాంటి యాప్... వాడడం ఎలాగో ఫుల్ డీటెయిల్స్ చదవండి
సీఈఎస్ 2021: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ షో ప్రారంభం
సిగ్నల్: వాట్సాప్‌కు తాతలాంటి యాప్... వాడడం ఎలాగో ఫుల్ డీటెయిల్స్ చదవండి
ఈ మధ్యనే వచ్చిన సిగ్నల్ యాప్ ఇక నుండి వాట్సాప్‌తో యుద్ధానికి సిద్ధం అయ్యింది. ఇక ఆ రెండు నేను అంటే నేను అని సవాల్ విసురుకుంటున్నాయి.
ఇక పోతే ‘సిగ్నల్ యాప్ ఐతే తన ఫుల్ సిగ్నల్‌తో వాట్సాప్ యూజర్లను తనవైపు తిప్పుకుంటుంది .
ఇలా ఐతే ఇక మెసెంజేర్, వాట్సాప్‌లకు ఇక ఇబ్బందే. ఇప్పటి వరకు వాట్సాప్‌కు గట్టి పోటీ ఇచ్చే యాప్ లేక ఇదే వాడేవారు.
ఇప్పుడు ఇటు వైపు వస్తున్నారు. ఇకపోతే ‘సే హెలో టు ప్రైవసీ’ అన్న టాగ్‌లైన్లో ఉండే సిగ్నల్ యూజర్ల డేటా ప్రైవసీకి పెద్దపీట వేస్తుందని వినియోగదారులు చెబుతున్నారు ఇది
వాట్సాప్‌లానే ఉండడం వలన ‘సిగ్నల్’ యాప్‌తో ఇబ్బంది ఉండకపోవచ్చు అని వినియోగదారులు చెబుతున్నారు.
వాట్సాప్‌ను వదిలి వెళ్లట కు కారణమ ఇది ఫేస్బుక్‌కు చెందినది కావడంతో ఫేస్బుక్‌తో షేర్చేసుకోనుందిఅని సమాచారం.
ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో Elon Musk ఇటీవల ‘సిగ్నల్’ యాప్ను వాడమని తన ట్విటర్ పేజీ లో పిలుపునివ్వడంతో క్రమంగా వాట్సాప్ యూజర్ల సిగ్నల్‌కు జంప్ అవుతున్నారు.
ఈ కారణంతో కూడా....
ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ కొత్త టర్మ్స్అండ్ ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అప్డేట్ చేసిన కొత్త పాలసీని యూజర్స్అంగీకరించని తరుణంలో వారి ఖాతా తొలగించబడుతుందని అందులో పేర్కొంది. కొత్త పాలసీ అమలుతో యూజర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని వాట్సాప్ ఫేస్ బుక్‌తో షేర్ చేసుకోనుంది. ఈ నిర్ణయంపై యూజర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కొత్తగా సిగ్నల్ యాప్ ను ఉపయోగించే చాలా మంది వినియోగదారులు ఎలా వాడాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు .
ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ...
మీఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
ఆ తరువాత దాన్ని ఫోన్లో ఇన్ స్టాల్ చేయాలి.
ఓపెన్ చేసిన తరువాత ఫోన్ నంబర్ తో లాగిన్ అవ్వమని అడుగుతుంది.
మీ ఫోన్ నంబర్ ఇవ్వడం ద్వారా మీకు ఓటీపీ వస్తుంది.
తరువాత మీ ఫోటో యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీరు మీ స్నేహితులను యాడ్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు, మీరు సిగ్నల్ యాప్లో కుడి ఎగువ భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
అక్కడ మీకు కనిపిస్తున్న ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.
షేర్ విత్ కాంటాక్ట్స్ లేదా చూజ్ హౌ టూ షేర్ అనేవి మీకు కనిపిస్తాయి.
ఇప్పుడు హౌ టూ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కనిపిస్తున్న లింకును ఇతర గ్రూప్ లలో షేర్ చేసి ఆహ్వానించవచ్చు.
సిగ్నల్ యాప్ లో మామూలు మొబైల్ తరహాలో వాయిస్ కాల్ ఫుల్ క్లారిటీ ఉండడం కూడా దీనికి అదనపు ఆకర్షణగా నిలవనుంది.
మీ ఐపీ అడ్రస్ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్ ఫీచరును వాడుకోవచ్చు.
అంటే సిగ్నల్ యాప్ సర్వర్ల ద్వారా కాల్స్ వెళ్తాయి. ఈ ఆప్షన్ ఉపయోగించినప్పుడు వాయిస్ క్వాలిటీ కొంత తగ్గుతుంది. వాట్సాప్ లాగే సిగ్నల్ యాప్‌లో కూడా వీడియో కాల్ సౌకర్యం ఉంది. సిగ్నల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్ తదితర ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేస్తుంది.
గ్రూపులు కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కూడా ఇటీవలే జోడించింది. మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రిప్లై ఇవ్వడం, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ , డిజపియరింగ్ మెసేజ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Sunday, 10 January 2021
సీఈఎస్ 2021: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ షో ప్రారంభం
Tuesday, 5 January 2021
ఓటీపీ రాకపోయినా భయం లేకుండా ట్రాంజాక్షన్
ప్రస్తుత పోటీ ప్రపంచం లోమానవుడు చాల అద్భుతాలు చేసాడు . అయితే మొన్నటి వరకు కంప్యూటర్ యుగం నడుస్తుంది .ఐతే దాంతో పటు ఇప్పుడు OTP యుగం మొదలు అయ్యింది .. . మనం ఇప్పుడు ఏది కొనాలి అన్నా మొబైల్ లో ట్రాంజక్షన్ చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది అది మనం ఎంటర్ చేస్తే అప్పుడు డబ్బులు వాడికి వెళ్ళేది . ఐతే ఒక్క్కోసారి అది వెళ్ళాక చాల ఇబ్బంది పడేవాళ్ళం .ఆఇబ్బంది లేకుండా అతను కరోనా సమయంలో క్వారంటైన్‌లో గడుపుతు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)లు సమయానికి రాక, ఒక్కోసారి వచ్చిన పాస్‌వర్డ్‌లతో పని జరగక ఇబ్బంది పడి, ఓ సరికొత్త పరిష్కారంతో ముందుకు వచ్చాడు అతనే ప్రభాత్ సాహు అనే 23 ఏళ్ళ కుర్రవాడు శాస్త్ర పరిజ్ఞానం తో ఒక సాంకేతికతను అభివృద్ధి చేశాడు. అది ఎలా అంటే OTP, పాస్వర్డ్ లేకుండా లావాదేవీలు లు చేసే విధంగా తయారు చేసాడు. ఇది తక్కువ సమయంలో ఇంతకు ముందు కంటే అతి తక్కువ సమయంలో పని పూర్తి అవుతుంది. అని అన్నారు. అలాగే OTP ఉత్పత్తి ఖర్చు 19 పైసలు అలాగే ఈ సాంకేతిక పరిజ్ఞానం అయ్యే ఖర్చు 5 పైసలు ఖర్చు అవుతాయి. ఇలా అయితే ఒక్కో బ్యాంకు అయ్యే ఖర్చు ఏడాదికి కి 2.6 కోట్లు ఖర్చు ఆదా చెయ్యవచ్చు అని తెలిపారు. ఇతను ఒక లాబ్ ను కూడా స్థాపించి SAWO అని అన్నారు. సావో(SAWO ) అంటే సెక్యూర్ అథెంటికేషన్ వితవుట్ ఓటీపీ.
ఐతే మొదటిప్రైవేట్ కీ పరికరంలో ఉంటుంది మరియు రెండవ కీ సర్వర్‌లో సేవ్ చేయబడుతుంది. ఇప్పుడు మీరు తదుపరిసారి లావాదేవీని నిర్వహించినప్పుడు, OTP అవసరం లేదు. మీరు లావాదేవీని చేసిన వెంటనే, ప్రైవేట్ కీ సర్వర్‌లో సేవ్ చేసిన ఇతర కీతో సరిపోలుతుంది మరియు అది సరైనదని ధృవీకరిస్తుంది.మీ ప్రైవేట్ కీ పబ్లిక్ కీ టోకెన్‌లో ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ మీదే అని ప్రతీక. ఇది ఇన్వాయిస్ నంబర్ కమ్యూనికేట్ చేసినట్లుగా ఉంటుంది, దీనిలో ఇన్వాయిస్ నంబర్ కమ్యూనికేట్ చేయబడుతుంది కాని దానిపై వ్రాసిన మొత్తం కాదు. పబ్లిక్ కీ అనేది ఆల్ఫా న్యూమరిక్ కోడ్, ఇది ప్రతిసారీ మారుతూ ఉంటుంది మరియు తద్వారా లావాదేవీ చేయవచ్చు.
సావో సాంకేతికతను ఉపయోగించుకునే కంపెనీలు మొదట వినియోగదారుల తమ ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరును ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ సమయంలో వినియోగదారులు వీటిని ఎంటర్ చేయాలి. దీంతో రెండు కీలు జెనరేట్ అవుతాయి. వీటిలో మొదటిది ప్రైవేట్ కీ. రెండోది పబ్లిక్ కీ.
ప్రైవేట్ కీ మన డివైజ్‌లోనే ఉంటుంది. మొదటి మనకు నచ్చిన పాస్వర్డ్ ప్రైవేట్ కీగా పెట్టుకోవచ్చు. పబ్లిక్ కీ సర్వర్‌లో సేవ్ అవుతుంది. ఈ కీ లా సాయంతో ఓటీపీలు లేకుండానే మనం లావాదేవీలు పూర్తిచేయొచ్చు. మనం ఎంటర్‌చేసేమొదటి కీ రెండో దానితో మ్యాచ్ అయితే లావాదేవీలు జరుగుతాయి.
‘‘ఆ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ మీదే అని ప్రైవేట్ కీ ధ్రువీకరిస్తుంది. పబ్లిక్ కీ ప్రతి లావాదేవీకీ మారుతూ ఉంటుంది’’అని ప్రభాత్ సాహు చెప్పారు.
ఒకవేళ మన ఫోన్ పోగొట్టుకున్నా లేదా కొత్త ఫోన్ కొన్నా మళ్లీ మనం సావోతో రీకనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది.
అతను మాటలు ఆడుతూ ఎలాంటి వివరాలనూ స్టోర్ చేసుకోంమేం కస్టమర్ల డివైజ్‌లలోనే సమాచారాన్ని స్టోర్ చేస్తాం. కీలు జెనరేట్ చేసే సమయంలోనూ ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ విధానాలను అనుసరిస్తాం.హ్యాకర్లు ఇంకా అధునాతన పద్ధతులు అనుసరిస్తేఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు కనుక్కోవడానికి సుమారుగా రెండున్నర గంటలు పడుతుంది.అప్పటికి వారు కేవలం ఒక వ్యక్తి వివరాలు మాత్రమే కనుక్కోగలరు అని ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేయాలని అనుకుంటే.. సదరు వ్యక్తి డివైజ్‌నే హ్యాక్ చేయాల్సి ఉంటుంది వ్యక్తి డివైజ్‌నే హ్యాక్ చేస్తారు తప్ప సర్వర్లపై ఎలాంటి ప్రభావమూ పడదు అని చెప్పారు
సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో Exide సంస్థ ఐదున్నర కోట్ల నిధులను సావో ల్యాబ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది.
Saturday, 2 January 2021
PVC ఆధార్ కార్డు డౌన్లోడ్ ఎలా....
ప్రస్తుత కాలంలో మన నిత్య జీవితంలో ఆధార్ ఓ భాగమై పోయింది. ఆధార్ మన
చెంత ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాల కోసమైన స్కాలర్ షిప్ కోసమైన ఆధార్ ఆవసరమే .అయితే చాలా మందికి తమ
ఆధార్ కార్డును జేబులో ఉంచరు. ఎందుకంటే నలిగిపోయి చిరిగిపోతుంటాయి. ఈ కష్టాలు ఇక ఉండదు . మన గవర్నమెంట్
యిపుడు PVC ఆధార్ కార్డు ను డౌన్లోడ్ సదుపాయం ను తెచ్చింది. ఇది ప్లాస్టిక్ కార్డు కావడం తో మనము మన మనవెంట పట్టుకొని వెళ్ళవచ్చు వర్షం
వచ్చి తడిసిపోయిన చిరిగిపోదు .
అందుకోసం ఆధార్ కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు . ఈ కార్డు
డౌన్లోడ్ కోసం UIDAIఅనే వెబ్
సైట్ లోకి వెళ్లి
మనం డౌన్లోడ్ చేసుకోవడమేదీని కోసమే అయితే ఆధార్ కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా మిగతా సేవల అప్డేట్ కోసం
మాత్రమే ఆధార్ కేంద్రానికి వెళ్ళాలి .
PVC ఆధార్ కార్డును పొందడం ఎలా అంటే..
1. ముందుగా ఆధార్ కార్డ్ అధికారిక వెబ్సైట్ (uidai.gov.in) ఓపెన్ చేయాలి.
2. ఆ తర్వాత మై ఆధార్ సెక్షన్లోకి వెళ్ళి ఆర్డర్ ఆధార్ PVC కార్డు పై క్లిక్ చేయాలి.
3. అనంతరం లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని దిగువన ఆధార్ ఆప్షన్ సెలక్ట్
చేసుకోండి.
4. తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా వర్చ్యువల్ id లేదా EID ని ఎంటర్ చేయాలి.
5. కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
6. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.
7. దేని తరువాత నెక్స్ట్ పేజీ లో మీ
ఫోటో తో ఒక ఆధార్ కార్డు
కనిపిస్తుంది
8. అక్కడ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం కనిపిస్తాయి.
9. అన్ని వివరాలను సరిపోయాయి అని అనుకుంటే మేక్ ఏ పేమెంట్ ఆప్షన్ కి వెళ్ళాలి
10. మొత్తం ప్రక్రియ పూర్తైన వెంటనే మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్
బ్యాంకింగ్ ద్వారా రూ.50 చెల్లించాలి.
11. ఆన్లైన్ నగదు చెల్లింపు చేసిన తర్వాత మీకు వెంటనే కన్ఫార్మ్అవుతుంది విషయం
కోసం మీ మొబైల్ నంబరుకు ఒక కోడ్ వస్తుంది.
ఈ విధంగా అయినతరువాత మనకు పోస్టల్ లో మనకు ఆ PVC కార్డు
కొద్దిరోజుల్లో మనఇంటి అడ్రస్ కు వస్తుంది
.
అతి తక్కువ ధర కే Samsung గేలాక్సీ M 12 ఫోన్.....
దక్షిణ కొరియా మొబైల్ కంపెనీ SAMSUNG త్వరలో గేలక్సీ ఎం 12 కొత్త
మొబైల్ ని భారీ బ్యాటరీ తో ఇండియా మార్కెట్ లో విడుదల చెయ్యబోతుంది .
టిప్‌స్టర్ స్టీవ్ హేమెర్‌స్టాఫర్ అకా ఆన్‌లీక్స్ మాటలు ఆడుతూ ఈ ఫోన్ ఫ్లాట్ డిస్ప్లేతో ప్లాస్టిక్
యూనిబోడీని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం12 వార్తల ప్రకారం, కంపెనీ నోయిడా ఫ్యాక్టరీలో SAMSUNG గెలాక్సీ ఎం12 యొక్క భారీ ఉత్పత్తి ప్రారంభమైంది. SAMSUNG ఇండియా వెబ్ సైట్ లో మోడల్ నంబర్ SM-F127G / DS తో Smart Phone జాబితా చేయబడింది. ఒకే మోడల్ నంబర్‌తో ఉన్న
హ్యాండ్‌సెట్ అనేక ధృవీకరణ మరియు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్లలో కూడా కనిపించింది. వీటిలో థాయిలాండ్ యొక్క ఎన్బిటిసి, బ్యూరో ఆఫ్
ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), బ్లూటూత్
ఎస్ఐజి, WIFI అలయన్స్, AFC మరియు
గీక్బెంచ్ ఉన్నాయి ఈ Smart Phone గురించి మరింత సమాచారం వెల్లడించలేదు .ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అనుకుంటున్నారు.
స్పెసిఫికేషన్స్ ఇలా
వుండొచ్చు .....
1) ఆండ్రాయిడ్ 11
2)ఎక్సినోస్ 850 ప్రాసెసర్
3) డిస్‌ప్లే 6. 7 ఇంచెస్
4) 262 పీపీఐ , ఐపిఎస్ ఎల్ సి డి
5) వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే
6) 3 జీబీ ర్యామ్
7)3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
8) టైప్-సి పోర్ట్ ఛార్జింగ్ కోసం
9)13 ఎంపీ వైడ్ అంగెల్ ప్రైమరీ కెమెరా
10) 5ఎంపీ వైడ్ యాంగల్ ,అల్ట్రావైడ్ యాంగల్
11) 2ఎంపీ డెప్త్ కెమెరా
12) చదరపు ఆకారంలో కెమెరా
13)భారీ బ్యాటరీ 7000 mAh
14) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఉండనుంది. రియల్‌మీ నార్జో,
రెడ్‌మీ నోట్ సిరీస్ వంటి ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.
కంపెనీ వెబ్ సైట్ లో ఫొటోస్ ని చూస్తే
ఇటీవల విడుదల చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎ42 5G లా అనిపిస్తుంది. కంపెనీ ఇంకా
అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. వినియోగదారులకు
అందుబాటు రేటులో ఉంటుంది అని భావిస్తున్నారు.
Thursday, 31 December 2020
108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ తక్కువ ధరకే....
Redmi ఫోన్లు ఇండియా లో మంచి మార్కెట్ ని సంపాదించాయి.. 20 వేలు ఖరీదు కలిగిన ఫోన్లు ఇండియా లో ఎక్కువగా అమ్ముడు అవుతున్నా యి..
ఇప్పుడు కొత్తగా లాంచ్ కానున్న ఫోన్ samsung ki గట్టి పోటీ ఇస్తుంది అని అనుకుంటున్నారు.
ఎప్పటిలాగే ఇండియన్ మార్కెట్ తమకు లాభాల వర్షం కురిపిస్తుందని షియోమీ కంపెనీ ఆశలు పెట్టుకుంది.
భారతీయ వినియోగదారులు కూడా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో రెడ్ మీ తమకు మంచి ఫోన్ అందిస్తుందని ఎదురు చూస్తున్నారు.
ఇది మూడు రంగుల్లో అందుబాటులో వస్తుంది.
స్పెసిఫికేషన్స్
డిస్ ప్లే:6.67 అంగుళాలు
ప్రాసెసర్:క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750జీ
ఫ్రంట్ కెమెరా:16 మెగా పిక్సల్
రియర్ కెమెరా: 108+8+2+2 మెగా పిక్సల్
ర్యామ్:6జీబీ
స్టోరేజ్:128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4820ఎంఏహెచ్
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
Wednesday, 30 December 2020
జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ను ఎలా వాడాలి.. ఫుల్ డీటెయిల్స్
ఫాస్టాగ్‌కు ఎంత ఖర్చువుతుందన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
యాపిల్ కంపెనీ బంపర్ ఆఫర్.. 11 కోట్లు గెలుచుకునే చాన్స్.. మీరు కూడా ట్రై చేయండి
సెక్యూరిటీ పరంగా ఐఫోన్లు ఎంత పటిష్టంగా అందరికీ తెలిసిందే. అయితే ఈ సెక్యూరిటీ ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడానికి యాపిల్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది.
సెక్యూరిటీ, ప్రైవసీపరంగా ఆపిల్ తన ఐ ఫోన్‌లు మరింత సురక్షితంగా ఉండే మాదిరిగా సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ఆపిల్ గతంలో ప్రకటించింది.
ఇప్పుడు ఆ సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండిపెండెంట్ భద్రతా పరిశోధకులకు ఆపిల్ ప్రత్యేక ఐ ఫోన్ యూనిట్లను పంపనున్నట్లు వెల్లడించింది. ఈ ఐ ఫోన్లు హ్యాకింగ్ చేయడానికి సులువుగా ఉంటాయని పేర్కొంది.
బహుమతి ఎలా గెలవొచ్చంటే..
స్వతంత్ర పరిశోధకులు యాపిల్‌తో కలిసి పని చేసేలా పరిశోధకులకు ఫోన్లు అందించింది.
ఈ ఫోన్లలో సాధారణ ఐ ఫోన్లతో పోలిస్తే సెక్యూరిటీ తక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఈ ఫోన్లలో తీవ్రమైన భద్రతా లోపాలను పరిశోధకులు సులభంగా గుర్తించవచ్చని పేర్కొంది.
హార్డ్‌వేర్‌పరంగా మాత్రం యూజర్ల ఫోన్లకు సమానంగా ఉంటుందని సంస్థ పేర్కొంది.
పరిశోధకులు సులువుగా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని పరీక్షించే విదంగా ప్రత్యేకంగా ఫోన్లను రూపొందించినట్లు యాపిల్ ప్రకటించింది.
దీంతో పెద్ద బగ్ ను గుర్తించే పరిశోధకులు 1.5 మిలియన్ల డాలర్ల(రూ. 11 కోట్లు) వరకు నగదు బహుమతిని ఇస్తామని యాపిల్ ప్రకటించింది.
Tuesday, 29 December 2020
One Nation One Mobility Card ఎలా పొందాలి?
ఇండియా లో ఒకే పన్ను GST వచ్చిన తరువాత బహుళ పన్నులు చెల్లించడం లేదు ఇప్పుడు ప్రధానమాంత్రి మోడీ ఇప్పుడు వన్ నటిస్తోన్న వన్ మొబిలిటీ కార్డు లంచ్ చేసారు ఇప్పుడు ఆ కార్డు తో అన్ని ఛార్జ్ లు చెల్లించవచ్చును అనగా కార్డుతో పౌరులు బస్సు ఛార్జీలు, మెట్రో ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు, టోల్ టాక్స్, రిటైల్ షాపింగ్ చెల్లించవచ్చు మరియు డబ్బును కూడా withdraw చేసుకోవచ్చను
One Nation One Mobility Card భారతదేశ ప్రభుత్వ "మేక్ ఇన్ ఇండియా" ప్రచారం / ప్రాజెక్టులో ఒక భాగం అని చెప్పగలను. ఇప్పటి వరకు భారతదేశం టెక్నాలజీ కోసం ఒక విదేశీ దేశంపై ఆధారపడాలి. ఈ కార్డు దేశీయంగా అభివృద్ధి చేయబడింది మరియు మన దేశం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ ఒక కార్డు ఉంటే మనతో పాటు డబ్బులు పట్టుకెల్లే అవసరం ఇప్పుడు ఉండదు.
మేడ్ ఇన్ ఇండియా ఈ ప్రయత్నాన్ని భారత ప్రభుత్వ గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఈ కార్డు యొక్క రీడర్ ప్రోటోటైప్‌ను సృష్టించింది. ఒకే కార్డు ప్రవేశపెట్టడంతో, వినియోగదారులు వివిధ మోడ్ ద్వారా ప్రయాణించడం నుండి రిటైల్ దుకాణాలలో షాపింగ్ చేయడం మరియు ATMల నుండి డబ్బును ఉపసంహరించుకోవడం నుండి వివిధ ప్రయోజనాలను పొందుతారు. టికెట్ కౌంటర్లలో మార్పు పొందడానికి వినియోగదారులు కష్టపడవలసిన అవసరం లేదు.One Nation One Mobility card ను లాంచ్ చేస్తున్నపుడు ఇది ఒక రకమైన మొబిలిటీ కార్డ్ మరియు రుపే కార్డు యొక్క మిశ్రమం అని ప్రధానమంత్రి తెలియచేసారు.రుపే One Nation One Mobility Card ఎలా పొందాలి అంటే ఈ RuPay కార్డు NCMC ద్వారా జారీ చేయబడుతుంది RBI చేత ఆమోదించబడిన ఏదైనా గుర్తింపు సంస్థలు,మరియు క్రెడిట్ / ప్రీపెయిడ్ కార్డ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కార్డులను విడుదల చేస్తారు.














