చైనా, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరువాత మన దేశ ప్రజలు, ప్రభుతం చైనా వస్తువులు కొనడం తగ్గించారు.
ఇండియాలో వినియోగిస్తున్న ఫోన్లు ఎక్కువగా చైనా నుంచే వస్తున్నాయి, అయితే, ఇవి భారత్‌లో తయారైనట్లు వాటిపై ముద్రిస్తున్నారు.
ఐతే ఇప్పుడు ఫేస్ చైన్ అనే కంపెనీ డిసెంబర్ 22న మనదేశంలో 2 ఇన్ బ్లాక్ పేరుతో పవర్ స్మార్ట్ ఫోన్‌లు లక్నోలో గ్రాండ్‌గా లాంఛ్ చేస్తున్నారు.
ఈ స్మార్టుఫోన్‌లో ఒక్క భాగం కూడా చైనాలో తయారు చేయలేదని ఆ సంస్థ చెబుతోంది.
విడిభాగాలన్నీ దుబాయిలో తయారయ్యాయి. ఇది చైనాలో తయారయ్యే ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఇంతవరకు దీని ఫీచర్లు, ధర వంటి వివరాలేవీ సంస్థ నుంచి వెల్లడి కాలేదు.
ధర తక్కువగా ఉంటుందని, స్క్రీన్ పెద్ద సైజులో ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సర్, పంచ్ హోల్ డిస్‌ప్లే కెమెరా ఉంటుందని అంచనా.
ఫోన్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా సంస్థకు చెందిన సిబ్బంది నేరుగా వినియోగదారుల ఇంటికే వచ్చి బాగు చేస్తారని.. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కొత్త ఫోన్ రీప్లేస్ చేస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం నోయిడా సెక్టార్ 63లో దీని ప్లాంటు ఉంది.. గౌతమ్ బుద్ధ నగర్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం సంస్థ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది.
No comments:
Post a Comment