Wednesday, 30 December 2020

యాపిల్ కంపెనీ బంపర్ ఆఫర్.. 11 కోట్లు గెలుచుకునే చాన్స్.. మీరు కూడా ట్రై చేయండి

ఐఫోన్, ప్రియమణి


సెక్యూరిటీ పరంగా ఐఫోన్లు  ఎంత ప‌టిష్టంగా అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌డానికి యాపిల్ కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తోంది. 

సెక్యూరిటీ, ప్రైవసీపరంగా ఆపిల్ తన ఐ ఫోన్‌లు మరింత సురక్షితంగా ఉండే మాదిరిగా సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ఆపిల్ గతంలో ప్రకటించింది.  

ఇప్పుడు ఆ సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండిపెండెంట్ భద్రతా పరిశోధకులకు ఆపిల్ ప్రత్యేక ఐ ఫోన్ యూనిట్లను పంపనున్నట్లు వెల్లడించింది. ఈ ఐ ఫోన్లు  హ్యాకింగ్ చేయడానికి సులువుగా ఉంటాయని పేర్కొంది. 

బహుమతి ఎలా గెలవొచ్చంటే..

స్వ‌తంత్ర‌ పరిశోధకులు యాపిల్‌తో కలిసి పని చేసేలా పరిశోధకులకు ఫోన్లు అందించింది. 

ఈ ఫోన్లలో సాధార‌ణ ఐ ఫోన్ల‌తో  పోలిస్తే సెక్యూరిటీ త‌క్కువగా ఉంటుందని పేర్కొంది. 

ఈ ఫోన్ల‌లో  తీవ్రమైన భద్రతా లోపాలను పరిశోధకులు సులభంగా గుర్తించవచ్చ‌ని  పేర్కొంది. 

హార్డ్‌వేర్‌పరంగా మాత్రం యూజర్ల ఫోన్లకు సమానంగా ఉంటుందని సంస్థ పేర్కొంది.  

ప‌రిశోధ‌కులు సులువుగా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని పరీక్షించే విదంగా ప్రత్యేకంగా ఫోన్లను రూపొందించినట్లు యాపిల్ ప్ర‌క‌టించింది. 

దీంతో పెద్ద బగ్ ను గుర్తించే పరిశోధకులు 1.5 మిలియన్ల డాలర్ల(రూ. 11 కోట్లు) వరకు నగదు బహుమతిని ఇస్తామ‌ని  యాపిల్ ప్ర‌క‌టించింది.


No comments:

Post a Comment