ఇప్పటివరకు మనం హైవేలో వెళ్తే టోల్ ప్లాజా దగ్గర లైన్‌లో ఉండి టోల్ ఛార్జీ కట్టి వెళ్లేవాళ్ళం.
పండగ రోజుల్లో అయితే పెద్ద లైన్ ఉంటుంది.. చాలాసేపు వెయిటింగ్ చేయాల్సి వచ్చేది.
కొంతమంది
ఇంకా తెలివి ఉపయోగించి టూల్ ప్లాజా సిబ్బంది పేరు చెప్పి కూడా
వెళ్లే డబ్బులు కట్టకుండా వెళ్లే రోజులు ఉన్నాయ్ కానీ ఇప్పుడు ఆ
అవకాశం ఇక రాదు.. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫాస్టాగ్
తప్పనిసరి చేసింది . ఆ ఫాస్ట్ ట్యాగ్ ఎలా ఆ ఫాస్టాగ్ ఎలా
తీసుకోవాలో దానికి ఎలా రీఛార్జి చెయ్యాలో ఇప్పుడు చూద్దాం .
ఫాస్టాగ్ కొనాలంటే నేరుగా టోల్ ప్లాజాల దగ్గరే వెళ్లవచ్చు.
దీనికోసం మీ ఐడీ, వెహికిల్ రిజిస్ట్రేషన్ పత్రాలను కచ్చితంగామనతో పాటు తీసుకు వెళ్ళాలి .
టోల్
ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ కెవైసి కోసం ఆ ఎంప్లాయ్ లు మనంతో పాటు
తీసుకువచ్చిన పత్రాలు ఇస్తే మన ముందే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు . అలా
మనము కొనవచ్చు. ఇవి కా కుండా ఇంకా Paytm ,Airtel Bank కూడా ఈ సదుపాయమును
ఇస్తున్నాయి వీటితో పాటు బ్యాంకులు కూడా ఇస్తున్నాయి అవిఏంటో ఇప్పుడు
చూద్దాం
* SBI
*HDFC
*ICICI
* Kotak Mahindra Bank
*Axis Bank
*induslnd Bank
*Federal bank
ఇప్పుడు
అందరిదగ్గర స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయ్ ఫోన్ రీఛార్జ్ మనము ఎలా మనమే
చేసుకుంటున్నామో అలానే ఈ ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చాలా సులభంగా
చూసుకోవచ్చు
డెబిట్
కార్డు ,క్రెడిట్ కార్డు ,మీరు ఏ బ్యాంక్ నుంచి కొన్నారో దాని ఆన్లైన్
బ్యాంకింగ్ ద్వారా కూడాచేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ప్రతి
వక్కరిదగ్గరఉంటుంది ఫోన్ పే , గూగుల్ పే ,పేటీఎం, అమెజాన్ పే లో కూడాఅవవుతుంది .మీరు ఏది ఐతే వాడుతారో దానిలో రీఛార్జ్ ఆప్షన్ లో వెళ్లి
అక్కడ ఫాస్టాగ్ అనే ఆప్షన్లలో వెళ్లి మీ వెహికల్ నెంబర్ కొట్టి
తరువాత పేరు ఇస్తే మనం ఎంత రీఛార్జ్ అనేది మనఇష్టం .
ఎంత ఖర్చవుతుంది?
ఫాస్టాగ్‌కు ఎంత ఖర్చువుతుందన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మొదటిది
మీరు ఏ వాహనం కోసం తీసుకుంటున్నారు అంటే కార్, జీప్, వ్యాన్, బస్,
ట్రక్, వాణిజ్య వాహనాలు . 2.. ఏ బ్యాంక్ నుంచి ఈ ఫాస్టాగ్‌ను
తీసుకుంటారన్నదానిపై కూడా ధర ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ మీ కారుకు
పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకోవాలని అనుకుంటే.. రూ.500 నుంచి కొనుగోలు
చేయవచ్చు. ఇందులోనే రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ రూ.250, కనీస 150
రూపాయలు కూడా ఉంటుంది.
ఇదే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అయితే.. ట్యాగ్ జారీ
చేయడానికి రూ.99.12, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్, రూ.200 కనీస
బ్యాలెన్స్ అవసరమవుతుంది.
ఫాస్టాగ్‌లపై పలు బ్యాంక్‌లు క్యాష్‌బ్యాక్
ఆఫర్లు కూడా ఇస్తున్నాయి.
No comments:
Post a Comment