Thursday, 31 December 2020

108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ తక్కువ ధరకే....



షియోమీ కంపెనీ కి చెందిన Mi10i ఫోన్ ను ఇండియా లో జనవరి 5 న మార్కెట్ లో కి రానుంది అని షియోమీ కంపెనీ ఇండియా చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు ఇది చైనాలో నవంబర్ లోనే విడుదల అయింది . ఇది చైనా లో లాంచ్ ఐన Redmi note 9 ప్రో 5జీకి లా వుండొచ్చు అని మార్కెట్ వర్గాలు అనుకుంటున్నాయి . కానీ కంపెనీ చీఫ్ మనుకుమార్ జైన్ మాట్లాడుతూ ఇది ఇండియా వినియోదారులు తగినట్టు ఉంటుంది అని చెప్పారు .

Redmi ఫోన్లు ఇండియా లో మంచి మార్కెట్ ని సంపాదించాయి.. 20 వేలు ఖరీదు కలిగిన ఫోన్లు ఇండియా లో ఎక్కువగా అమ్ముడు అవుతున్నా యి..
ఇప్పుడు కొత్తగా లాంచ్ కానున్న ఫోన్ samsung ki గట్టి పోటీ ఇస్తుంది అని అనుకుంటున్నారు.
ఎప్పటిలాగే ఇండియన్ మార్కెట్ తమకు లాభాల వర్షం కురిపిస్తుందని షియోమీ కంపెనీ ఆశలు పెట్టుకుంది.
భారతీయ వినియోగదారులు కూడా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో రెడ్ మీ తమకు మంచి ఫోన్ అందిస్తుందని ఎదురు చూస్తున్నారు.

ఇది మూడు రంగుల్లో అందుబాటులో వస్తుంది.

స్పెసిఫికేషన్స్

డిస్ ప్లే:6.67 అంగుళాలు

ప్రాసెసర్:క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750జీ

ఫ్రంట్ కెమెరా:16 మెగా పిక్సల్

రియర్ కెమెరా: 108+8+2+2 మెగా పిక్సల్

ర్యామ్:6జీబీ

స్టోరేజ్:128జీబీ

బ్యాటరీ కెపాసిటీ: 4820ఎంఏహెచ్

ఓఎస్: ఆండ్రాయిడ్ 10

Wednesday, 30 December 2020

జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్టాగ్‌ను ఎలా వాడాలి.. ఫుల్ డీటెయిల్స్

 

fastag,toll plaza,paytm,cars,2021



ఇప్పటివరకు  మనం హైవేలో వెళ్తే టోల్ ప్లాజా దగ్గర లైన్‌లో ఉండి టోల్ ఛార్జీ కట్టి  వెళ్లేవాళ్ళం. 
పండగ రోజుల్లో అయితే పెద్ద లైన్ ఉంటుంది.. చాలాసేపు వెయిటింగ్ చేయాల్సి వచ్చేది. 
కొంతమంది ఇంకా తెలివి  ఉపయోగించి  టూల్ ప్లాజా  సిబ్బంది  పేరు  చెప్పి కూడా  వెళ్లే  డబ్బులు  కట్టకుండా  వెళ్లే రోజులు  ఉన్నాయ్  కానీ  ఇప్పుడు ఆ   అవకాశం ఇక రాదు.. ఎందుకంటే  కేంద్ర ప్రభుత్వం  ఇప్పుడు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసింది .  ఆ ఫాస్ట్ ట్యాగ్  ఎలా  ఆ ఫాస్టాగ్‌  ఎలా తీసుకోవాలో  దానికి ఎలా  రీఛార్జి చెయ్యాలో  ఇప్పుడు చూద్దాం .
ఫాస్టాగ్ కొనాలంటే నేరుగా టోల్ ప్లాజాల ద‌గ్గ‌రే వెళ్లవ‌చ్చు. 
దీనికోసం మీ ఐడీ, వెహికిల్ రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలను క‌చ్చితంగామనతో పాటు  తీసుకు వెళ్ళాలి .  
టోల్ ప్లాజాల  దగ్గర  ఫాస్టాగ్ కెవైసి కోసం ఆ ఎంప్లాయ్ లు మనంతో పాటు  తీసుకువచ్చిన పత్రాలు ఇస్తే మన ముందే వాళ్ళు ప్రాసెస్  చేస్తారు . అలా  మనము కొనవచ్చు. ఇవి  కా కుండా  ఇంకా  Paytm ,Airtel Bank కూడా ఈ సదుపాయమును ఇస్తున్నాయి  వీటితో పాటు బ్యాంకులు కూడా  ఇస్తున్నాయి  అవిఏంటో  ఇప్పుడు  చూద్దాం 
* SBI 
*HDFC 
*ICICI 
* Kotak Mahindra Bank
*Axis Bank
*induslnd Bank 
*Federal  bank
ఇప్పుడు  అందరిదగ్గర స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయ్  ఫోన్ రీఛార్జ్  మనము ఎలా మనమే  చేసుకుంటున్నామో  అలానే ఈ ఫాస్టాగ్‌ రీఛార్జ్  కూడా  చాలా  సులభంగా  చూసుకోవచ్చు 
డెబిట్ కార్డు ,క్రెడిట్ కార్డు ,మీరు ఏ బ్యాంక్ నుంచి కొన్నారో దాని ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడాచేసుకోవచ్చు అలాగే ఇప్పుడు  ప్రతి  వక్కరిదగ్గరఉంటుంది    ఫోన్ పే , గూగుల్ పే ,పేటీఎం, అమెజాన్ పే లో కూడాఅవవుతుంది .మీరు ఏది ఐతే వాడుతారో దానిలో రీఛార్జ్  ఆప్షన్ లో వెళ్లి   అక్కడ ఫాస్టాగ్‌ అనే ఆప్షన్లలో వెళ్లి  మీ వెహికల్  నెంబర్ కొట్టి   తరువాత  పేరు ఇస్తే  మనం ఎంత రీఛార్జ్  అనేది మనఇష్టం . 
ఎంత ఖర్చవుతుంది?

ఫాస్టాగ్‌కు ఎంత ఖ‌ర్చువుతుంద‌న్న‌ది రెండు అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. 

మొద‌టిది మీరు ఏ వాహ‌నం కోసం తీసుకుంటున్నారు అంటే కార్‌, జీప్‌, వ్యాన్‌, బ‌స్‌, ట్ర‌క్‌, వాణిజ్య వాహ‌నాలు . 2.. ఏ బ్యాంక్ నుంచి ఈ ఫాస్టాగ్‌ను తీసుకుంటార‌న్న‌దానిపై కూడా ధ‌ర ఆధార‌ప‌డి ఉంటుంది. 
 
ఒక‌వేళ మీ కారుకు పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకోవాల‌ని అనుకుంటే.. రూ.500 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులోనే రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ రూ.250, క‌నీస 150 రూపాయలు  కూడా ఉంటుంది.  
ఇదే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అయితే.. ట్యాగ్ జారీ చేయ‌డానికి రూ.99.12, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌, రూ.200 క‌నీస బ్యాలెన్స్ అవ‌స‌ర‌మ‌వుతుంది. 
ఫాస్టాగ్‌ల‌పై ప‌లు బ్యాంక్‌లు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు కూడా ఇస్తున్నాయి.

యాపిల్ కంపెనీ బంపర్ ఆఫర్.. 11 కోట్లు గెలుచుకునే చాన్స్.. మీరు కూడా ట్రై చేయండి

ఐఫోన్, ప్రియమణి


సెక్యూరిటీ పరంగా ఐఫోన్లు  ఎంత ప‌టిష్టంగా అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌డానికి యాపిల్ కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తోంది. 

సెక్యూరిటీ, ప్రైవసీపరంగా ఆపిల్ తన ఐ ఫోన్‌లు మరింత సురక్షితంగా ఉండే మాదిరిగా సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ఆపిల్ గతంలో ప్రకటించింది.  

ఇప్పుడు ఆ సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండిపెండెంట్ భద్రతా పరిశోధకులకు ఆపిల్ ప్రత్యేక ఐ ఫోన్ యూనిట్లను పంపనున్నట్లు వెల్లడించింది. ఈ ఐ ఫోన్లు  హ్యాకింగ్ చేయడానికి సులువుగా ఉంటాయని పేర్కొంది. 

బహుమతి ఎలా గెలవొచ్చంటే..

స్వ‌తంత్ర‌ పరిశోధకులు యాపిల్‌తో కలిసి పని చేసేలా పరిశోధకులకు ఫోన్లు అందించింది. 

ఈ ఫోన్లలో సాధార‌ణ ఐ ఫోన్ల‌తో  పోలిస్తే సెక్యూరిటీ త‌క్కువగా ఉంటుందని పేర్కొంది. 

ఈ ఫోన్ల‌లో  తీవ్రమైన భద్రతా లోపాలను పరిశోధకులు సులభంగా గుర్తించవచ్చ‌ని  పేర్కొంది. 

హార్డ్‌వేర్‌పరంగా మాత్రం యూజర్ల ఫోన్లకు సమానంగా ఉంటుందని సంస్థ పేర్కొంది.  

ప‌రిశోధ‌కులు సులువుగా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని పరీక్షించే విదంగా ప్రత్యేకంగా ఫోన్లను రూపొందించినట్లు యాపిల్ ప్ర‌క‌టించింది. 

దీంతో పెద్ద బగ్ ను గుర్తించే పరిశోధకులు 1.5 మిలియన్ల డాలర్ల(రూ. 11 కోట్లు) వరకు నగదు బహుమతిని ఇస్తామ‌ని  యాపిల్ ప్ర‌క‌టించింది.


Tuesday, 29 December 2020

One Nation One Mobility Card ఎలా పొందాలి?

 

 

 


 

ఇండియా లో ఒకే పన్ను    GST   వచ్చిన తరువాత బహుళ  పన్నులు చెల్లించడం లేదు ఇప్పుడు  ప్రధానమాంత్రి  మోడీ ఇప్పుడు వన్ నటిస్తోన్న వన్ మొబిలిటీ  కార్డు లంచ్ చేసారు  ఇప్పుడు ఆ  కార్డు తో అన్ని ఛార్జ్ లు చెల్లించవచ్చును  అనగా  కార్డుతో పౌరులు బస్సు ఛార్జీలు, మెట్రో ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు, టోల్ టాక్స్, రిటైల్ షాపింగ్ చెల్లించవచ్చు మరియు డబ్బును కూడా withdraw చేసుకోవచ్చను

 One Nation One Mobility Card భారతదేశ ప్రభుత్వ "మేక్ ఇన్ ఇండియా" ప్రచారం / ప్రాజెక్టులో ఒక భాగం అని చెప్పగలను. ఇప్పటి వరకు భారతదేశం టెక్నాలజీ కోసం ఒక విదేశీ దేశంపై ఆధారపడాలి. ఈ కార్డు దేశీయంగా అభివృద్ధి చేయబడింది మరియు మన దేశం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ ఒక కార్డు ఉంటే మనతో పాటు  డబ్బులు  పట్టుకెల్లే అవసరం ఇప్పుడు ఉండదు.

   మేడ్ ఇన్ ఇండియా ఈ ప్రయత్నాన్ని భారత ప్రభుత్వ గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఈ కార్డు యొక్క రీడర్ ప్రోటోటైప్‌ను సృష్టించింది. ఒకే కార్డు ప్రవేశపెట్టడంతో, వినియోగదారులు వివిధ మోడ్ ద్వారా ప్రయాణించడం నుండి రిటైల్ దుకాణాలలో షాపింగ్ చేయడం మరియు ATMల నుండి డబ్బును ఉపసంహరించుకోవడం నుండి వివిధ ప్రయోజనాలను పొందుతారు. టికెట్ కౌంటర్లలో మార్పు పొందడానికి వినియోగదారులు కష్టపడవలసిన అవసరం లేదు.One Nation One Mobility card ను లాంచ్ చేస్తున్నపుడు ఇది ఒక రకమైన మొబిలిటీ కార్డ్ మరియు రుపే కార్డు యొక్క మిశ్రమం అని ప్రధానమంత్రి తెలియచేసారు.
రుపే One Nation One Mobility Card ఎలా పొందాలి అంటే RuPay కార్డు NCMC ద్వారా జారీ చేయబడుతుంది RBI చేత ఆమోదించబడిన ఏదైనా గుర్తింపు సంస్థలు,మరియు క్రెడిట్ / ప్రీపెయిడ్ కార్డ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కార్డులను విడుదల చేస్తారు.

 

Sunday, 27 December 2020

ఈ ఏడాదికి చివర్లో లాంచ్ అయిన ఫోన్లు......




ప్రపంచ మార్కెట్లో విడుదలైన మన దేశంలో ఈ 2020 డిసెంబరులో విడుదల అయిన ప్రముఖ కంపెనీల ఫోన్స్ జాబితా ఇవే.
ఒప్పో రెనో5,
Huawei నోవా8
మోటో g9 ప్లస్
నోకియా 7.3
నోకియా5.4
Xiami mi11
వివో x60
లెనోవో లెమన్ కె12
సామ్ సoగ్ ఎం02
హానర్ V40
సామ్ సoగ్ A52
సామ్ సoగ్ A72
Xiaomi Mi 10i
Redmi 9 power

వీటి స్పెసిఫికేషన్స్

Moto G9 Plus

ఈ స్మార్ట్ ఫోన్ 6.8-అంగుళాల HD + మాక్స్ విజన్ డిస్ప్లే తో వస్తుంది. ఈ LCD ప్యానెల్ FHD + రిజల్యూషన్‌ను అందిస్తుంది మరియు HDR10 సర్టిఫికేట్ పొందింది. 16MP సెల్ఫీ షూటర్‌ను ప్యాక్ చేసే పంచ్-హోల్ ఉంది. దీనిలో f / 2.2 ఎపర్చరు ఉంటుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో నిలువు కెమెరా మాడ్యూల్ ఉంది. 64MP ప్రాధమిక కెమెరా సెన్సార్‌ను f / 1.8 ఎపర్చర్‌తో కలిగి ఉంది.L- ఆకారపు మాడ్యూల్ 118-డిగ్రీల FoV తో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ మరియు 2MP సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ రెండూ f / 2.4 ఎపర్చర్‌ను కలిగి ఉంటాయి. ఈ,9 పరికరం ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో ముందే ఇన్‌స్టాల్ చేయబడి 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది.

Nokia 5.4
6.4 అంగుళాల స్క్రీన్, Android v10 (Q) ఆపరేటింగ్ సిస్టం .
ఇక కెమెరా విషయానికి వస్తే, 48 MP + 8 MP + 2 MP + 2 MP వెనుక కెమెరా లు ,8 MP సెల్ఫీ కెమెరా ,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ మరియు 4000 mAh బ్యాటరీ

Samsung M02
5.7 అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్ప్లే, ఆక్టా-కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్ తో రావొచ్చని అంచనా.13MP ప్రైమరీ షూటర్ మరియు 2 ఎంపి 8 ఎంపి సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ మార్చలేని లియాన్ బ్యాటరీ

OPPO Reno5
6.43 అంగుళాల AMOLED డిస్ప్లే . RAM మరియు స్టోరేజీ విషయాలకు వస్తే 128GB - 8GB RAM, 256GB-12GB RAM . ఇంకా కెమెరా విషయంలో 64 MP + 8 MP + 2 MP + 2 MP వెనుక కెమెరా మరియు 32 MP ఫ్రంట్ కెమెరా 5.

Lenovo Lemon K12
720x1640 పిక్సెల్స్ వద్ద HD + రిజల్యూషన్‌కు మద్దతు ఉన్న 6.8-అంగుళాల డిస్ప్లే. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4GB RAM దీన్ని 256GB స్టోరేజీయూ9, 64MP + 2MP + 2MP వెనుక కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా .

Huawei Nova8
6.53 అంగుళాల OLED డిస్ప్లే, స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. హిసిలికాన్ కిరిన్ 985 5G చిప్‌సెట్, 64MP + 8MP + 8MP + 2MP వెనుక కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా మరియు 4000mAh బ్యాటరీ తో వచ్చింది.

Honor V40
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల పూర్తి HD + డిస్ప్లే, HMS తో ఆండ్రాయిడ్ 10.0 మ్యాజిక్ UI 3 (గూగుల్ ప్లే సేవలు లేవు), ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8GB RAM, 64 MP + 12 MP + 2 MP వెనుక కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరా 66W సూపర్ ఛార్జ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 40W వైర్‌లెస్ ఛార్జింగ్

Vivo X60
వివో నుంచి X60 ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 6.53 అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్ప్లే , 48 MP +2 MP + 2 MP కెమెరా, 6 జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 10 - ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించండి ఫన్‌టచ్ 10.5 ఆపరేటింగ్ సిస్టం మరియు 4500 mAh బ్యాటరీ.

Samsung A72
6.7అంగుళాల సూపర్ అమోలేడ్ డిస్ప్లే, 6 జిబి ర్యామ్, 64MP, 12MP, 5MP మరియు 5MP రియర్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 చిప్‌సెట్, 4,500 mAh లియాన్ బ్యాటరీ.

Samsung A52
6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే, 6GB RAM , క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్ ,32 MP ఫ్రంట్ కెమెరా మరియు 4000 mAh బ్యాటరీ.

Xiaomi Mi 11
6.67 అంగుళాలు స్క్రీన్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 6/8GB RAM , 108 MP + 8 MP + 16 MP + 2 MP వెనుక కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరా మరియు 4750 mAh బ్యాటరీ.

Xiaomi Mi 10i
6.67 అంగుళాలు డిస్ప్లే, 64MP, 12MP, 5MP, మరియు 5MP వెనుక కెమెరా, ఆండ్రాయిడ్ 10, MIUI 12, క్వాల్కమ్ SM7225 స్నాప్‌డ్రాగన్ 750G 5G ప్రాసెసర్, 108 MP + 8 MP + 2 MP + 2 MP + 2 MP వెనుక కెమెరా, 16 MP ఆఫ్ ఫ్రంట్ కెమెరా మరియు Li-Po 4820 mAh బ్యాటరీ.

Redmi 9 Power
6.53 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 10, MIUI 12 ,క్వాల్కమ్ SM6115 స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ తో రాబోతోంది. ఇంకా RAM మరియు స్టోరేజీ ల కాంబినేషన్ లను పరిశీలిస్తే 128GB - 4GB RAM, 128GB - 6GB RAM, 128GB -8GB RAM, 256GB -8GB RAM తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 48 MP + 8 MP + 2 MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా మరియు Li-Po 6000 mAh, నాన్ రేమోవాబుల్ బ్యాటరీ

Nokia 7.3
6.5-అంగుళాల FHD + HDR ప్యూర్‌డిస్ప్లే ,ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ వన్ క్వాల్కమ్ SM6350 స్నాప్‌డ్రాగన్ 690 5 జి (8 ఎన్ఎమ్) ప్రాసెసర్ మరియు 48 ఎంపి వెనుక కెమెరా 24 ఎంపి ఫ్రంట్ కెమెరా . 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ .


Saturday, 26 December 2020

2020లో టాప్-10 “5G” ఫోన్లు ఇవే.. రూ.20 వేల నుంచి ప్రారంభం

 

5G, Top 10 ,Apple ,Samsung,Oppo, Techfollow

ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న 10  “5జీ ఫోన్ల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న ఫోన్లు ఇవే!

 1. ఐఫోన్ 12

ధర: రూ.79,999 నుంచి ప్రారంభం

డిస్ ప్లే: 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లే

కెమెరా: 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 12 మెగా పిక్సెల్

ర్యామ్: 4 జీబీ

బ్యాటరీ: 2815 ఎంఏహెచ్

ప్రాసెసర్: యాపిల్ ఏ14 బయోనిక్

 2. ఐఫోన్ 12 ప్రో

ధర: రూ.1,19,999 నుంచి ప్రారంభం

డిస్ ప్లే: 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లే

కెమెరా: 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 12 మెగా పిక్సెల్

ర్యామ్: 6 జీబీ

బ్యాటరీ: 2815 ఎంఏహెచ్ప్రాసెసర్: యాపిల్ ఏ14 బయోనిక్

 3. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ

ధర: రూ.1,04,999 నుంచి ప్రారంభం

డిస్ ప్లే: 6.9 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 108 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 10 మెగా పిక్సెల్

ర్యామ్: 12 జీబీ

బ్యాటరీ: 4500 ఎంఏహెచ్

ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865+

4. హువావే నోవా 7 5జీ

ధర: ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కాలేదు. చైనాలో ధర 2,999 యువాన్లు(సుమారు రూ.32,000)

డిస్ ప్లే: 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్

ర్యామ్: 8 జీబీ

బ్యాటరీ: 4000 ఎంఏహెచ్

ప్రాసెసర్: హైసిలికాన్ కిరిన్ 985

5. హువావే పీ40 5జీ

ధర: ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కాలేదు. ప్రపంచ మార్కెట్లో దీని ధర 799 యూరోలు(సుమారు రూ.66,300)

డిస్ ప్లే: 6.1 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 50 మెగా పిక్సెల్ + 16 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్ + ఐఆర్ సెన్సార్

ర్యామ్: 8 జీబీ

బ్యాటరీ: 3800 ఎంఏహెచ్

ప్రాసెసర్: హైసిలికాన్ కిరిన్ 990 5జీ

6. ఒప్పో ఏ72 5జీ

ధర: ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కాలేదు. చైనాలో ధర 1,899 యువాన్లు(సుమారు రూ.20,000)

డిస్ ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 16 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 16 మెగా పిక్సెల్

ర్యామ్: 8 జీబీ

బ్యాటరీ: 4040 ఎంఏహెచ్

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 720

7. హువావే పీ40 ప్రో 5జీ

ధర: ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కాలేదు. ప్రపంచ మార్కెట్లో దీని ధర 999 యూరోలు(సుమారు రూ.82,900)

డిస్ ప్లే: 6.58 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 50 మెగా పిక్సెల్ + 40 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + డెప్త్ సెన్సార్

సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్ + డెప్త్ సెన్సార్

ర్యామ్: 8 జీబీ

బ్యాటరీ: 4200 ఎంఏహెచ్

ప్రాసెసర్: హైసిలికాన్ కిరిన్ 990 5జీ

8. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 5జీ

ధర: రూ.77,999 నుంచి ప్రారంభం

డిస్ ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 12 మెగా పిక్సెల్ + 64 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 10 మెగా పిక్సెల్

ర్యామ్: 8 జీబీ

బ్యాటరీ: 4300 ఎంఏహెచ్

ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865+

 9. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ప్లస్ 5జీ

ధర: రూ.77,999 నుంచి ప్రారంభం

డిస్ ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 12 మెగా పిక్సెల్ + 64 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 10 మెగా పిక్సెల్

ర్యామ్: 8 జీబీ

బ్యాటరీ: 4500 ఎంఏహెచ్

ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినోస్ 990

10. ఒప్పో రెనో 4 ఎస్ఈ

ధర: ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కాలేదు. చైనాలో ధర 2,499 యువాన్లు(సుమారు రూ.27,000)

డిస్ ప్లే: 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే

కెమెరా: 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్

సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్

ర్యామ్: 8 జీబీ

బ్యాటరీ: 4300 ఎంఏహెచ్

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 720