Saturday, 15 July 2017

కింగ్ స్టన్ నుంచి లేటెస్ట్ పెన్ డ్రైవ్

  
 స్టోరేజి డివైస్ లలో కింగ్ లాంటి కింగ్ స్టన్ మరో కొత్త పెన్ డ్రైవ్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. డేటా ట్రావెలర్ 2000  పేరిట  అధునాతన టెక్నాలిజీ తో పెన్ డ్రైవ్ ని విడుదల చేసింది. 
ఆల్ఫా న్యూమరిక్  కీ పాడ్  తో   ఈ  పెన్ డ్రైవ్ ని    సులభంగా లాక్ చెయ్యవచ్చు. ఈ  పెన్ డ్రైవ్ ని  కంప్యూటర్ నుండి  డిస్ కనెక్ట్  చేసిన వెంటనే  లాక్  పడిపోతుంది.

పాస్ వర్డ్ తప్పుకొడితే అంతే సంగతులు..
పాస్ వర్డును తప్పుగా 10 సార్లు ఎంటర్  చేస్తే  దాని లోని డేటా మొత్తం  పోతుంది .  హార్డ్ వేర్   ఎన్ క్రిప్క్షన్ తో పాటు పిన్ ప్రొటక్షన్  ని కూడా  అందిస్తుంది  ఆ కంపెనీ .  ఇది  రిటైల్  మార్కెట్   తో పాటు  ఆన్ లైన్  లో కూడా  దొరుకుతుంది. ఇది  16 , 32, 64 జీబీ  లో  దొరుకుతుంది. 
ధర ఇలా..
 1. 16 జీబీ   10  వేలు   రూపాయలు 
2. 32 జీబీ  14   వేలు   రూపాయలు  
3. 64 జీబీ  18    వేలు   రూపాయలు

    

No comments:

Post a Comment