Tuesday, 11 July 2017

ఎయిర్‌టెల్ యూజర్లకుకూడా 4G VOLTE లభ్యం కానున్నాయి..


ఎయిర్‌టెల్ సంస్థ ఈ ఏడాది డిసెంబరులోగా 4జీ వీవోఎల్‌టీఈ సేవలను ప్రారంభించనుంది. ముందుగా దేశంలోని 5 ప్రధాన టెలికాం సర్కిల్స్‌లో ఈ సేవలు ప్రారంభమవుతాయి. దేశంలో ఇంతవరకు ఒక్క జియో మాత్రమే వీవోఎల్‌టీఈ సేవలను అందిస్తోంది.  ఎయిర్ టెల్ కనుక ప్రారంభిస్తే జియో తరువాతి స్థానంలో ఎయిర్‌టెల్ ఉంటుంది.
కాగా 4జీ వీఓఎల్టీఈ సేవలకు సంబంధించి ఎయిర్‌టెల్ గతంలో నోకియాతో రూ.402 కోట్ల ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరి వరకు ఎయిర్‌టెల్ యూజర్లకు 4జీ వీవోఎల్‌టీఈ సేవలు లభ్యం కానున్నాయి. ఇక ఇతర టెలికాం సంస్థలైన ఐడియా, వొడాఫోన్‌లు కూడా వీలైనంత త్వరగా 4జీ వీవోఎల్‌టీఈ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి.





2 comments: