Monday, 17 July 2017

పానాసోనిక్ స్మార్ట్ ఫోన్ P55 Max

జపాన్ దేశానికీ చెందిన  పానాసోనిక్  కంపెనీ పీ 55మాక్స్   అనే   స్మార్ట్ ఫోన్  5000 mah   బ్యాటరీతో   మార్కెట్లో కి విడుదల  చేసింది .   ఇది   8,499 రూపాయిలకి లభిస్తుంది . పానాసోనిక్  ఇండియా  మొబిలిటీ  డివిజన్  హెడ్  పంకజ్ రాణా  గారు  అధిక  బ్యాటరీ సామర్ధ్యంతో లాంగ్‌ లాస్టింగ్‌ బ్యాటరీ ద్వారా   వాల్యూ  బేస్డ్‌ సెగ్మెంట్‌లో  అందుబాటులోకి తెచ్చామని చెప్పారు .అలాగే ఈ  స్మార్ట్ ఫోన్  ఈ  నెల  17 వ తేదీ   ఫ్లిప్ కార్ట్   (ఈ  కామర్స్) సైట్   లో బ్లాక్  ,గోల్డ్   కలర్స్ లో    దొరుకుతుంది  అని పానాసోనిక్ కంపెనీ తెలిపింది.
దీని లో స్పెషిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి...  
* 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
* 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
*  5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
*  ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0
*  1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
*  1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్‌ ప్రాసెసర్
*  5000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 3 జీబీ ర్యామ్
*  16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 
* 128 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్






                     

Saturday, 15 July 2017

కింగ్ స్టన్ నుంచి లేటెస్ట్ పెన్ డ్రైవ్

  
 స్టోరేజి డివైస్ లలో కింగ్ లాంటి కింగ్ స్టన్ మరో కొత్త పెన్ డ్రైవ్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. డేటా ట్రావెలర్ 2000  పేరిట  అధునాతన టెక్నాలిజీ తో పెన్ డ్రైవ్ ని విడుదల చేసింది. 
ఆల్ఫా న్యూమరిక్  కీ పాడ్  తో   ఈ  పెన్ డ్రైవ్ ని    సులభంగా లాక్ చెయ్యవచ్చు. ఈ  పెన్ డ్రైవ్ ని  కంప్యూటర్ నుండి  డిస్ కనెక్ట్  చేసిన వెంటనే  లాక్  పడిపోతుంది.

పాస్ వర్డ్ తప్పుకొడితే అంతే సంగతులు..
పాస్ వర్డును తప్పుగా 10 సార్లు ఎంటర్  చేస్తే  దాని లోని డేటా మొత్తం  పోతుంది .  హార్డ్ వేర్   ఎన్ క్రిప్క్షన్ తో పాటు పిన్ ప్రొటక్షన్  ని కూడా  అందిస్తుంది  ఆ కంపెనీ .  ఇది  రిటైల్  మార్కెట్   తో పాటు  ఆన్ లైన్  లో కూడా  దొరుకుతుంది. ఇది  16 , 32, 64 జీబీ  లో  దొరుకుతుంది. 
ధర ఇలా..
 1. 16 జీబీ   10  వేలు   రూపాయలు 
2. 32 జీబీ  14   వేలు   రూపాయలు  
3. 64 జీబీ  18    వేలు   రూపాయలు

    

Tuesday, 11 July 2017

ఎయిర్‌టెల్ యూజర్లకుకూడా 4G VOLTE లభ్యం కానున్నాయి..


ఎయిర్‌టెల్ సంస్థ ఈ ఏడాది డిసెంబరులోగా 4జీ వీవోఎల్‌టీఈ సేవలను ప్రారంభించనుంది. ముందుగా దేశంలోని 5 ప్రధాన టెలికాం సర్కిల్స్‌లో ఈ సేవలు ప్రారంభమవుతాయి. దేశంలో ఇంతవరకు ఒక్క జియో మాత్రమే వీవోఎల్‌టీఈ సేవలను అందిస్తోంది.  ఎయిర్ టెల్ కనుక ప్రారంభిస్తే జియో తరువాతి స్థానంలో ఎయిర్‌టెల్ ఉంటుంది.
కాగా 4జీ వీఓఎల్టీఈ సేవలకు సంబంధించి ఎయిర్‌టెల్ గతంలో నోకియాతో రూ.402 కోట్ల ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరి వరకు ఎయిర్‌టెల్ యూజర్లకు 4జీ వీవోఎల్‌టీఈ సేవలు లభ్యం కానున్నాయి. ఇక ఇతర టెలికాం సంస్థలైన ఐడియా, వొడాఫోన్‌లు కూడా వీలైనంత త్వరగా 4జీ వీవోఎల్‌టీఈ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి.