Wednesday, 20 January 2021

వైరు లేకుండా టీవీ.. ఈ టెక్నాలజీ వచ్చేస్తోంది


resonance tv,wirelesstvs,wi-fi,russia


టీవీ అంటే కరెంటు కనెక్షన్.. ప్లగ్, వైర్ అన్నీ ఉండాలి. కానీ, ఇక నుంచి అలాంటి అవసరం లేకుండా వైరన్నది లేకుండా పనిచేసే టీవీలు వస్తున్నాయి. అలాంటి  టెక్నాలజీ అభివృద్ధి చేసింది రష్యాకు చెందిన రెజొనెన్స్ అనే స్టార్టప్‌ కంపెనీ. దీన్ని ఆ కంపెనీ వైర్‌లెస్‌ టెక్నాలజీ అంటోంది. ఈ టెక్నాలజీలో  కరెంటు ప్లగ్  బదులుగా వైఫై పద్ధతిలో టీవీకి విద్యుత్‌ సరఫరా వస్తుంది.

వైఫై పద్ధతిలో విద్యుత్‌ను సరఫరా చేసే వ్యవస్థ, దాన్ని స్వీక‌రించే రిసెప్షన్‌ సిస్టమ్‌ వంటి అధునాతన టెక్నాలజీ ఈ  టీవీలలో  ఏర్పాటు చేశారు. ఈ నూతన  టెక్నాలజీని రీసెంటుగా జరిగిన సీఈఎస్‌-2021లో ప్రదర్శించారు. 

ఐతే ఈ టెక్నాలజీ ఐడియా కొత్తదేమీ కాదు. ఇలాంటిది డెవలప్ చేస్తామని సీఈఎస్‌-2020లో కొరియా కంపెనీ శాంసంగ్ చెప్పింది. కానీ, తన ప్రణాళికలను ఆ తరువాత శాంసంగ్ రద్దు చేసుకుంది.

 రష్యాకు చెందిన రెజొనెన్స్ అనే స్టార్టప్‌ కంపెనీ వైర్‌లెస్‌ పద్ధతిలో విద్యుత్‌ను స్వీక‌రించే రిసీవర్‌ కాయిల్‌ను టీవీ లోపలే ఏర్పాటు చేశామని, ప్రసారం చేసే ట్రాన్స్‌మీటర్‌ను టీవీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని తెలిపింది. 

అలాగే కనీసం ఒక‌ మీటర్‌ దూరం వర‌కు విద్యుత్తును ప్రసారం చేయవచ్చని, కాయిల్‌ సైజును మార్చడం ద్వారా ఈ దూరాన్ని మరింత పెంచవచ్చని తెలిపింది. 

రిసీవర్‌ కాయిల్‌ను టెలివిజన్ ‌ఫ్రేమ్‌లో చేర్చ‌వ‌చ్చ‌ని, ట్రాన్స్‌మీటర్‌ను అవసరాన్ని బట్టి టెలివిజన్‌ అడుగున‌గానీ, గోడ లోపలగాని ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 

 అయితే పేటెంట్ల  హక్కులు కోసం  కెనడా, యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా , దక్షిణ కొరియా ఇంకా ఇండియా లో కూడా  దరఖాస్తు చేసుకుంది. 

వైర్‌లెస్ టీవీ 80-90% ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని మరియు 120W వరకు ఉపయోగించే టీవీలతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు , వంటి పెద్ద పరికరాల్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించవచ్చు.

No comments:

Post a Comment