Monday, 8 November 2021

డ్రైవర్ కు సడెన్ గా గుండె నొప్పి వస్తే గుర్తించే కార్.........

కాలం తో పాటు మనిషి కూడా వేగంగా పరిగెడుతూ ఉన్నాడు అలాగే మనిషి క్రొత్త టెక్నాలజీని కనిపెడుతున్నాడు. ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పటివరకు ఉన్నది కాదు అని మరో కొత్త టెక్నాలజీ రోజురోజుకూ మారుతుంది.     ఆటోమొబైల్ రంగంలో  కొత్త టెక్నాలజీని జోడించి  జపాన్ దేశానికి చెందిన కార్ల తయారీ సంస్థ అయిన  మజ్దా ఓ సరికొత్త కారును సిద్ధం చేస్తోంది… వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని  దీనిని తయారు చేస్తోంది.  డ్రైవర్ కు సడెన్ గా ఏ ఆరోగ్యం సమస్యలు వచ్చినా అలాగే గుండె పోటు వస్తే ఇది ముందుగా గుర్తుపట్టి వెంటనే అలర్ట్ చేస్తుంది. అలాగే వారిని సేఫ్ గా ఉంచుతుంది.  అదే ఈ కార్ లో ఉండే ఆధునిక టెక్నాలజీ(కార్లో కో పైలెట్ మోడ్) అభివృద్ధి చేసింది.    కార్లో కో పైలెట్ మోడ్ అనే టెక్నాలజీ వలనకార్లలో ఉండే అంతర్గత కెమెరాల ద్వారా  డ్రైవర్ ముకకవళికలు బట్టి ఇది గుర్తుపట్టి కార్ లో ప్రయాణం చేసే వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. అలాగే కార్ లో ఎమర్జెన్సీ లైట్స్ వెలిగి ఒకవేళ డ్రైవరు కి గుండెపోటు వస్తే దాని  గుర్తించి తక్షణమే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పట్టుకుని వెళ్లే అవకాశం ఉంటుంది అని ఆ కారు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇది మార్కెట్లో రావడానికి మరో 5 ఏళ్ళు పడుతుంది అని ఈ జపాన్ దేశానికి చెందిన కార్ల కంపెనీ తెలిపింది.